అమాంతం ఎలుక తలను కొరికి.. ఆపై ఏంచేశాడంటే?

Subscribe to Oneindia Telugu

సిడ్నీ : ఫేస్ బుక్ తరహా సోషల్ మీడియా అందుబాటులో వచ్చాక, వ్యక్తిగత ఇమేజ్ ను లైకులు-కామెంట్ల ద్వారా కొలవడం పరిపాటిగా మారిపోయింది. ఎంతలా అంటే, లైకులు కామెంట్లు రావడమే జీవితానికో ధ్యేయమన్నట్టుగా తయారైంది పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఫేస్ బుక్ లో తమ పోస్టులు అందరి దృష్టిని ఆకర్ణించడానికి చిత్ర విచిత్ర విన్యాసాలకు పాల్పడుతున్నారు కొంతమంది ప్రబుద్దులు.

పాపులారిటీ కోసమే చేశాడో.. పైశాచిక ఆనందమో తెలియదు గానీ ఇదే తరహాలో వ్యవహరించి వార్తల్లో నిలిచాడు మాథ్యూ మలోనీ అనే ఆస్ట్రేలియా. ఓ ఎలుక తలను కొరికి.. ఆ తతంగాన్నంతా వీడియో తీసి మరీ ఫేస్ బుక్ లో పోస్టు చేశాడు మాథ్యూ మలోనీ. ఎలుక తలను కొరికిన తర్వాత నోటికంటిన రక్తాన్ని తుడిచేయడానికి మూడు పెగ్గుల వొడ్కాను ఉపయోగించాడని సమాచారం.

man bites off rat's head in 'sick' Facebook video

ఇదిలా ఉంటే ఎలుక తలను కొరకడాన్ని తీవ్రంగా పరిగణించిన అక్కడి కోర్టు, మూడేళ్ల పాటు పెంపుడు జంతువులను పెంచుకునే హక్కును మలోనీ విషయంలో నిషేధించింది. అలాగే చేసిన తప్పుకు శిక్షగా 100 గంటల పాటు సామాజిక సేవ చేయాలని మలోనిని ఆదేశించింది కోర్టు. గత జనవరిలో ఎలుకను కొరికి చంపిన వీడియోను మాథ్యూ మలోని ఫేస్ బుక్ లో పోస్టు చేయగా, విషయం కాస్త పోలీసుల ద్రుష్టికి వెళ్లింది. దీంతో మలోనిని విచారించిన పోలీసులు న్యాయస్థానంలో హాజరుపర్చగా తాజా తీర్పును వెలువరించింది కోర్టు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Matthew Maloney, known as "Mad Matt", was charged following a raid in January by RSPCA investigators after he posted a video of the bizarre stunt on Facebook.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి