మందు పార్టీ: చికెన్ ముక్క కోసం చంపేశాడు

టెక్సాస్: మద్యం మత్తులో ఉన్న ఇద్దరు స్నేహితులు సహనం కొల్పోయి కత్తులు బయటకు తీశారు. ఆవేశంలో ఒకరు కత్తితో దాడి చెయ్యడంతో ఓ వ్యక్తి ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. చివరి చికెన్ ముక్క ఓ నిండు ప్రాణాన్ని బలిగొందని పోలీసులు అన్నారు.

అమెరికాలోని టెక్సాస్‌లో ఈ దారుణం చోటు చేసుకుంది. పార్టీలో చికెన్ ముక్క కోసం చెలరేగిన స్వల్ప వివాదంతో స్నేహితుడిని పొడిచి చంపిన ఘటన కలకలం రేపిందని పోలీసులు చెప్పారు. హూస్టన్ పోలీసులు తెలిపిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి.

రినాల్డ్ కార్డోసో రివేరా (38) డార్విన్ పెరెజ్ గోంజాలెజ్ (34) ఇద్దరూ స్నేహితులు. బుధవారం పెరేజ్ నివాసంలో మరో ఐదు మంది స్నేహితులు కలిసి మద్యం పార్టీ ఏర్పాటు చేసుకున్నారు. మందులోకి చికెన్ తెచ్చుకున్నారు.

Man killed for grabbing last piece of chicken in Texas

అందరూ పార్టీలో మునిగితేలారు. చికెన్ ఖాళీ అయ్యింది. డార్విన్ చేతిలో ఆఖరి చికెన్ ముక్క ఉంది. ఆ సందర్బంలో ఆ చికెన్ ముక్క తనకే కావాలంటూ రివేరా గొడవ పెట్టుకున్నాడు. ఇద్దరూ ఒకరిని ఒకరు బూతులు తిట్టుకున్నారు.

సాటి స్నేహితులు నచ్చ చెప్పినా ఇద్దరూ వినలేదు. ఒకరి మీద ఒకరు దాడి చేసుకున్నారు. అదే సందర్బలో రివేరా కత్తి తీసుకుని డార్విన్ మీద దాడి చేశాడు. డార్విన్ కు గాయాలైనాయి. స్నేహితులు రివేరాను పట్టుకున్నారు.

అయితే సహనం కొల్పోయిన రివేరా స్నేహితులను పక్కకు నెట్టి డార్విన్ ను పట్టుకుని పదేపదే కత్తితో దాడి చేసి చంపేశాడు. తరువాత అక్కడి నుంచి పారిపోయాడు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. కొన్ని గంటల తరువాత రివేరా నేరుగా పోలీసుల దగ్గరకు వెళ్లి లొంగిపోయాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+