గర్ల్ ఫ్రెండ్ కొడుకుని నేలకేసి కొట్టి చంపిన రెజ్లర్
జెర్సీ షోర్: రెజ్లింగ్ పోటీలలో భాగంగా ప్రాక్టీస్ చేస్తున్న ఒక యువ రెజ్లర్ సహనం కోల్పోయి మంచం మీద నిద్రపోతున్న పసిబాలుడిని ఎత్తుకుని నేలకు వేసి అతి దారుణంగా చంపేశాడు. బాలుడిని హత్య చేసిన రెజ్లర్ ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు.
బ్రాండన్ హాఫ్ మెన్ (20) అనే యువకుడు రెజ్లర్. ఇతనికి గర్ల్ ఫ్రెండ్ ఉంది. ఆమెకు 18 నెలల కుమారుడు ఉన్నాడు. ఆమె ఉద్యోగానికి వెళ్లే సమయంలో బాలుడిని తన బాయ్ ఫ్రెండ్ బ్రాండన్ హాఫ్ మెన్ దగ్గర వదిలి వెళుతుంటుంది.
గురువారం కుమారుడిని హాఫ్ మెన్ దగ్గర వదిలి ఉద్యోగానికి వెళ్లింది. ఆ సమయంలో హాఫ్ మెన్ రెజ్లింగ్ ప్రాక్టీస్ చేస్తున్నాడు. ప్రత్యర్థిని భుజాల మీదకు ఎత్తుకుని చుట్టూ తిప్పుతూ కిందకు వేసి ఎలా కొట్టాలో ప్రయత్నాలు చేస్తూ ఆలోచించాడు.
అంతే మంచం మీద నిద్రపోతున్న గర్ల్ ఫ్రెండ్ కుమారుడు ఇతని కంట్లో పడ్డాడు. వెంటనే బాలుడిని భుజం మీదకు ఎత్తుకుని తిప్పుతూ కిందకు వేసి దారుణంగా కోట్టాడు. తల, భుజం తదిర చోట్ల తీవ్రగాయాలైన బాలుడు మరణించాడు. ఇంటికి వచ్చిన బాలుడి తల్లి విషయం గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేసింది.
పోలీసులు హాఫ్ మెన్ ను అదుపులోకి తీసుకుని విచారణ చేశారు. మొదట అతను బాలుడిని పైకి ఎగరవేసి పట్టుకునే సమయంలో జారి కిందపడి మరణించాడని చెప్పాడు. అయితే పోలీసులు బెండ్ తియ్యడంతో అసలు విషయం అంగీకరించాడు.
పోలీసులు హాఫ్ మెన్ ను కోర్టులో హాజరుపరిచారు. కేసు వివరాలు తెలుసుకున్న న్యాయస్థానం రూ. ఒక కోటి విలువైన పూచికత్తు మీద హాఫ్ మెన్ కు బెయిల్ మంజూరు చేసింది. హాఫ్ మెన్ పసిబాలుడి పట్ల ప్రవర్థించిన తీరుపై ప్రపంచ రెజ్లింగ్ సంఘాలు మండిపడుతున్నాయి. అతనిని రెజ్లింగ్ నుండి బహిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు.












Click it and Unblock the Notifications