16ఏళ్ల బాలికను పొదల్లోకి లాక్కెళ్లాడు: బాలికను రేప్ నుంచి కాపాడిన చీమలు, ఎలాగంటే?

జకర్తా: ఇండోనేసియాలో ఓ ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. చీమలు చేసిన పని ఓ పదహారేళ్ల బాలిక అత్యాచారానికి గురికాకుండా ఆపింది. చీమల దండు ఓ నిందితుడిని అదేపనిగా కుట్టడంతో బాలిక రక్షించపడింది.

ఇండోనేసియాలో పదహారేళ్ల బాలిక పైన 29 ఏళ్ల టోనీ ఐర్వాన్ అత్యాచారం చేయబోయాడు. అదే సమయంలో కొన్ని చీమల గుంపు అతనిని కుట్టనారంభించాయి. దీంతో అతనును ఆ బాలికను ఏమీ చేయలేని పరిస్థితి ఏర్పడింది. ఈ సంఘటన ఇండోనేసియా సులవేసి ప్రావిన్స్‌లోని సుకమజులో జరిగింది.

డ్రైవ్‌కు వెళ్దామని చెప్పి అత్యాచారయత్నం

డ్రైవ్‌కు వెళ్దామని చెప్పి అత్యాచారయత్నం

మనం డ్రైవ్‌కు వెళ్దామని నిందితుడు టోనీ ఐర్వాన్.. పదహారేళ్ల బాలికతో చెప్పాడు. దీంతో ఆమె సరేనని చెప్పింది. డ్రైవ్ సందర్భంగా కొంత దూరం వెళ్లాక.. కాసేపు కలిసి నిద్రపోదామని (అత్యాచారం చేసే ఉద్దేశ్యంతో ఇద్దరం కలిసి పడుకుందామని అడిగాడు) చెప్పాడు. అతను తన దుర్బుద్దిని చాటుకునే ప్రయత్నం చేశాడు. దానికి ఆ బాలిక ససేమీరా అన్నది.

బలవంతంగా పొదల్లోకి లాక్కెళ్లాడు

బలవంతంగా పొదల్లోకి లాక్కెళ్లాడు

నిందితుడు మాత్రం ఆమెపై అఘాయిత్యం చేసే ప్రయత్నం చేశాడు. దీంతో ఆమె అతని నుంచి తప్పించుకునే ప్రయత్నాలు చేసింది. ఆమెను బలవంతంగా సమీపంలోని పొదల్లోకి లాక్కెళ్లాడు. అత్యాచార ప్రయత్నం చేశాడు. అదే సమయంలో చీమల గుంపు అతనిని కుట్టింది. ఆ మంట తాళలేక అతను అక్కడి నుంచి కదిలాడు. అప్పుడు బాలిక తప్పించుకుంది. చీమల కారణంగా అత్యాచారం నుంచి ఆమె బయటపడింది.

అరెస్ట్ చేసిన పోలీసులు

అరెస్ట్ చేసిన పోలీసులు

ఆమె వెంటనే సమీపంలోని ఇళ్లలోకి పరుగులు పెట్టింది. స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే వచ్చిన పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. అతనిని రిమాండుకు తరలించారు. ఈ సంఘటన దాదాపు వారం రోజుల క్రితం జరిగింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+