ఇలా కూడా చేస్తారా! అనకొండను పట్టుకోవడానికి ఏం చేశాడో చూడండి (వీడియో)
సోమాలియా : తన కాలునే ఎరగా వేసి ఓ భారీ అనకొండను పట్టుకోవాలనుకున్నాడో వ్యక్తి. ఇందుకోసం తన కాలుకు ఒక గుడ్డ చుట్టుకుని బొరియ లాంటి అనకొండ సొరంగంలోకి దిగాడు. అనకొండ అతని కాలును అందుకోగానే.. అతన్ని పైకి లాగి అనకొండను పట్టుకోవాలనేది అతని అనుచరుల ప్లాన్.
ఇదే క్రమంలో.. అనకొండ దాగున్న చిన్న బొరియలోకి కాలును జొప్పించాడు సదరు వ్యక్తి. కొద్దిసేపటికి అనకొండ అతని కాలును మింగేయడానికి ప్రయత్నించడంతో.. వెంట వచ్చిన గ్యాంగ్ ను అప్రమత్తం చేశాడతను. దీంతో అంతా కలిసి అతన్ని పైకి లాగారు. అయితే అప్పటికే మోకాలు వరకు అతన్ని కాలును మింగేసింది అనకొండ.
తక్షణం ఓ పదునైన కత్తితో అనకొండను చీల్చి అతని కాలును బయటకు తీశారు. ఎక్కడ జరిగిందో.. ఎప్పుడు జరిగిందో తెలియదు గానీ ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా చక్కర్లు కొడుతోంది.












Click it and Unblock the Notifications