యువతిపై రేప్: నెల్సన్ మండేలా మనవడి అరెస్ట్
జోహన్నెస్‌బర్గ్: ఓ యువతి(15)పైఅత్యాచారం చేశాడన్న ఆరోపణలతో దక్షిణాఫ్రికా మాజీ అధ్యక్షుడు నెల్సన్ మండేలా మనవడు మబుసో మండేలా(24)ను దక్షిణాఫ్రికాలోని జొహన్నస్‌బర్గ్‌లో పోలీసులు అరెస్టు చేశారు.
అతడిని అక్కడి మేజిస్ట్రేట్ కోర్టులో మంగళవారం హాజరుపర్చారు. ఆగస్టు 7వ తేదీన జోహన్నస్‌బర్గ్‌లోని ఓ రెస్టారెంటులో యువతిపై అత్యాచారం చేశాడంటూ పోలీసులకు ఫిర్యాదు అందింది.

రెస్టారెంట్ టాయ్‌లెట్ గదిలోకి ఆ యువతిని బలవంతంగా తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడని మబుసోపై ఆగస్టు 14న అభియోగాలు నమోదయ్యాయి. కాగా, తన కొడుకు ఎలాంటి నేరానికి పాల్పడలేదని మబుసో తండ్రి తెలిపారు.
అయితే నెల్సన్ మండేలా పేరును ఉపయోగించి ఇలాంటి దారుణాలకు పాల్పడటం తగదని బాధితురాలి కుటుంబసభ్యులు అన్నారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
ఈ నేపథ్యంలో మబుసోను గత శనివారం అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. కాగా, ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.












Click it and Unblock the Notifications