ట్రంప్ నోట్లో మట్టి కొట్టారు కదరా

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు బిగ్ షాక్ తగిలింది. నోబెల్ శాంతి పురస్కరానాన్ని గెలుచుకోవాలన్న ఆయన కలలు కల్లలయ్యాయి. ఈ రేసు నుంచి ఆయన అవుట్ అయ్యారు. ఆయన ఆశలపై నోబెల్ కమిటీ నీళ్లు చల్లింది. ఈ ఏడాది నోబెల్ శాంతి బహుమతి (Nobel Peace Prize 2025) విజేత పేరును కొద్దిసేపటి కిందటే ప్రకటించింది. వెనెజులాకు చెందిన సామాజిక ఉద్యమ, మానవ హక్కుల కార్యకర్త మారియా కొరినా మచాడో (Maria Corina Machado)కు నోబెల్ శాంతి బహుమతి లభించింది.

వెనిజులా ప్రజాస్వామ్య పోరాట యోధురాలు మారియా కోరినా మచాడో. వెనిజులాలో ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించడానికి, అక్కడి నిరంకుశ పాలనను అంతం చేయడానికి అహర్నిశలు కృషి చేశారు. అహింసా మార్గంలో తన పోరాటాన్ని సాగించారు. అల్లకల్లోలానికి గురవుతున్న వెనిజులాలో శాంతియుత వాతావరణాన్ని నెలకొల్పారు. హింసను విడనాడాలంటూ పిలుపునిచ్చారు. అహింసాయుత పోరాటాన్ని ముందుండి నడిపించారు.

maria-corina-machado-awarded-2025-nobel-peace-prize-for-her-fight-for-democracy-in-venezuela

ఒకదశలో ఆమె వెనిజులాలో సుదీర్ఘకాలం పాటు అజ్ఞాతంలో జీవించాల్సిన పరిస్థితిని ఎదుర్కొన్నారు. ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించడానికి ఆమె చేసిన కృషికి గుర్తింపుగా నోబెల్ కమిటీ.. ఈ ఏడాది శాంతి పురస్కారానికి మారియా కొరినా పేరును ఎంపిక చేసింది. ప్రజాస్వామ్య ఉద్యమాన్ని ముందుండి నడిపించిన నాయకురాలిగా మారియా.. లాటిన్ అమెరికాలో అసాధారణ ధైర్య సాహసాలకు ప్రతీకగా నిలిచారని నార్వేజియన్ నోబెల్ కమిటీ ఛైర్మన్ జార్గెన్ వాట్నే ఫ్రైడ్ నెస్ ప్రశంసించారు.

నిరంకుశత్వం నుండి ఆ దేశం బయటపడటానికి, అక్కడ ప్రజాస్వామ్యం పునరుద్ధరణకు నోచుకోవడానికి, శాంతియుత పరివర్తన కోసం మారియా చేసిన అవిశ్రాంత కృషికి గుర్తింపుగా ఆమెకు నోబెల్ శాంతి బహుమతి లభిస్తోందని వెల్లడించారు. చిక్కటి చీకట్ల మధ్య ప్రజాస్వామ్య జ్వాలను వెలిగించిన శాంతి విజేతగా అభివర్ణించారు. ఒంటరిగా పోరాటాన్ని ఆరంభించి.. లక్షలాదిమందికి దిశానిర్దేశం చేసే స్థాయికి ఎదిగారని పేర్కొన్నారు. గత సంవత్సరం నోబెల్ శాంతి బహుమతి.. నిహాన్ హిడాన్క్యోకు లభించిన విషయం తెలిసిందే.

కాగా- ఈ నోబెల్ శాంతి పురస్కారం కోసం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చివరి వరకూ రేసులో నిల్చున్నారు. ఎనిమిది దేశాల మధ్య యుద్ధాన్ని నివారించానని, అంతర్జాతీయ స్థాయిలో వివాదాలను పరిష్కరించానని చెప్పుకొన్నారు. అదే సమయంలో ది పీస్ ప్రెసిడెంట్ అంటూ వైట్ హౌస్ ఓ ట్వీట్ కూడా చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇది- నోబెల్ శాంతి బహుమతి ఎవరికి దక్కుతుందనే చర్చకు దారి తీసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+