జుకర్‌బర్గ్ పై కేసు వేసిన జుకర్‌బర్గ్
వినడానికి విచిత్రంగానే ఉన్నా నిజంగా జరిగిన ఘటన ఇది. మెటా సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ చట్టపరమైన ఇబ్బందులను ఎదుర్కొంటోన్నాడు. కోర్టు మెట్లెక్కనున్నాడు. దీనికి కారణం- ఫేస్‌బుక్. ఓ అకౌంట్ పదే పదే సస్పెన్షన్ కు గురి కావడం వల్ల ఆ యూజర్.. ఏకంగా జుకర్‌బర్గ్ పైనే కేసు వేశాడు. పైగా ఆ యూజర్ ఓ అడ్వొకేట్ కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
ఆ అడ్వొకేట్ పేరు కూడా మార్క్ జుకర్ బర్గే. అమెరికా ఇండియానాకు చెందిన ఓ సీనియర్ అడ్వొకేట్. మెటా ప్లాట్‌ఫామ్‌లో తన ఖాతాలను పదే పదే సస్పెండ్ చేయడం వల్లే ఆయన ఈ చర్య తీసుకున్నారు. గత ఎనిమిదేళ్లుగా జుకర్ బర్గ్ కు చెందిన పర్సనల్, బిజినెస్ ఫేస్‌బుక్ అకౌంట్లు తరచూ సస్పెన్షన్ కు గురవుతూ వచ్చాయి. మెటా సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్‌కు చెందిన ఫేక్ అకౌంట్ గా గుర్తించడం వల్లే ఫేస్ బుక్ దీన్ని తరచూ సస్పెండ్ చేస్తూ వచ్చింది.

అది తనదేనంటూ ఐడీ ప్రూఫ్స్ సమర్పించినప్పటికీ- ఎటువంటి ఫలితం లేకపోవడం వల్ల అడ్వొకేట్ జుకర్ బర్గ్.. మెటా సీఈఓ జుకర్ బర్గ్ పై కేసు వేశాడు. అకౌంట్ లో తలెత్తిన ఇబ్బందుల వల్ల చాలావరకు క్లయింట్‌లను కోల్పోవాల్సి వస్తోందని, వారిని సంప్రదించడం కుదరట్లేదనేది అడ్వొకేట్ వాదన. ఫాలోయర్లు కూడా తగ్గిపోతోండటం వల్ల ఆదాయం తగ్గిపోతోందని, వేల డాలర్లు పెట్టి ప్రత్యేకంగా అడ్వర్టయిజ్మెంట్ ఇచ్చుకోవాల్సి వస్తోందని ఆయన వాపోయారు.
మారియన్ సుపీరియర్ కోర్టులో అడ్వొకేట్ జుకర్ బర్గ ఈ కేసు ఫైల్ చేశారు. సీఈఓ జుకర్ బర్గ్, మెటా యాజమాన్యం నిర్లక్ష్యం, కాంట్రాక్ట్ నిబంధనల ఉల్లంఘన వంటి అంశాలను పిటీషన్ లో పొందుపరిచారు. తన అకౌంట్స్ పునరుద్ధరణతో పాటు ఇప్పటివరకు కోల్పోయిన నిధులను తిరిగి చెల్లించాలని, పిటీషన్ కు సంబంధించిన న్యాయ ఖర్చులను మెటా యాజమాన్యమే భరించాలని ఆయన న్యాయస్థానాన్ని అభ్యర్థించారు.
జుకర్‌బర్గ్ బిజినెస్ అకౌంట్, పర్సనల్ ప్రొఫైల్ నాలుగుసార్లు సస్పెన్షన్ అయిందని ఆయన కోర్టులో వాదించారు. ఓ సస్పెన్షన్ నాలుగు నెలలకు పైగా కొనసాగిందని, దీని వల్ల కనీసం 11,000 డాలర్ల మొత్తాన్ని ప్రకటనల ద్వారా ఖర్చు చేయాల్సి వచ్చిందని అన్నారు. పదే పదే సస్పెండ్ చేయడం వల్ల తన కుటుంబ సభ్యులకు సంబంధించిన అకౌంట్స్ కూడా ప్రభావితం అయ్యాయని వాదించారు. దీనికంతటికీ సీఈఓ జుకర్ బర్గ్ కారణమని ఆరోపించారు.
-
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే! -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి?












Click it and Unblock the Notifications