పుతిన్‌పై హత్యాయత్నం .. కారులో భారీ పేలుడు.. జెలెన్ స్కీ చెప్పాడంటే..!
ఓ వైపు ఉక్రెయిన్-రష్యా యుద్ధం ముగించేందుకు అమెరికా మధ్యవర్తిత్వంతో చర్చలు జరుగుతున్న క్రమంలో రష్యా ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఆ దేశ అధ్యక్షుడు పుతిన్ కారులో భారీ పేలుడు సంభవించింది. పుతిన్ అధికారికంగా ఉపయోగించే ఆరస్ సీనట్ అనే పేరు గల కారులో పేలుడు సంభవించింది. ఈ ఘటన రష్యా రాజధాని మాస్కోలోని లుబియాంకా ఏరియాలో ఉన్న రష్యా గూఢచార సంస్థ ఎఫ్‌ఎస్‌బీ ప్రధాన కార్యాలయం సమీపంలోనే జరిగింది. అయితే ఈ ఘటన జరిగినప్పుడు కారులో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది.

పుతిన్ అధికారిక కారులో పేలుడు సంభవించగానే కారులో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. దీంతో సమీపంలోని రెస్టారెంట్ సిబ్బంది హుటాహుటిన వచ్చి మంటలను ఆర్పివేశారు. ఈ ప్రమాదంలో పుతిన్ అధికారికంగా వినియోగించే కారు వెనక భాగం పూర్తిగా కాలిపోయింది. ఈ కారులో పేలుడు ఎలా సంభవించింది ? లోపల ఎవరైనా పేలుడు పదార్థాలు అమర్చారా ? అనే కోణంలో అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. రష్యా- ఉక్రెయిన్ మధ్య యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో ఈ ప్రమాదం సంభవించడంపై అధికార యంత్రాంగం పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తోంది.
JUST IN: 🇷🇺 Luxury limousine from Russian President Putin's official motorcade exploded on the streets of Moscow, just blocks from the FSB headquarters.
— BRICS News (@BRICSinfo) March 29, 2025
It's unclear if this is an attempted ass*ssination attempt pic.twitter.com/Da4tcUoZEU
జెలెన్ స్కీ జోస్యం..
పుతిన్ త్వరలో చనిపోతారని.. యుద్ధం ముగిసిపోతుందని ఇటీవల జరిగిన ఓ ఇంటర్వ్యూలో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈలోపే ఇలా జరగడంపై రష్యా వ్యాప్తంగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇక ఇటీవల రష్యాలోని ముర్మాన్స్క్ ప్రాంతంలో పర్యటించిన పుతిన్.. అక్కడ నిర్వహించిన మీడియా సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశారు. ఉక్రెయిన్‌తో యుద్ధం ముగింపు గురించి మాట్లాడారు. జెలెన్ స్కీ దిగిపోయి కొత్త ప్రభుత్వం ఏర్పడితేనే శాంతి ఒప్పందంపై సంతకం జరుగుతుందని స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications