భారీ అగ్నిప్రమాదానికి 44 మంది బలి.. 270 మంది మిస్సింగ్ !!

హాంకాంగ్‌లో భారీ అగ్ని ప్రమాదం ఘటన యావత్ ప్రపంచాన్నీ కలవరపెడుతోంది. థాయ్‌ పొ జిల్లాలోని న్యూ టెరిటరిస్‌లో హౌసింగ్‌ కాంప్లెక్స్‌లోని బహుళ అంతస్తుల అపార్ట్‌మెంట్లో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఇప్పటి వరకు 44 మంది చనిపోగా.. 270 మందికి పైగా కనిపించకుండా పోయారు. ప్రమాదం జరిగిన భవన సముదాయంలో 2 వేల ఇళ్లు ఉండగా.. 4,800 మంది నివసిస్తున్నారని అధికారులు తెలిపారు. 128 ఫైరింజన్లతో సహాయ చర్యలు కొనసాగుతుండగా.. ఫైర్‌ సిబ్బంది ఒకరు మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. 32 అంతస్తులు ఉన్న ఈ 8 భవంతులు మంటల్లో కాలిపోతున్న వీడియోలు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్‌గా మారాయి.

బుధవారం మధ్యాహ్నం 2.51 గంటల సమయంలో ఈ ఘటనపై సమాచారం అందిందని అగ్నిమాపక విభాగం వెల్లడించింది. భవనాలు దగ్గరదగ్గరగా ఉండడంతో మంటలు ఇతర భవనాలకు వేగంగా వ్యాపించాయని అంటున్నారు. అంతే కాకుండా 1980లో నిర్మించిన ఈ భవన సముదాయానికి ప్రస్తుతం మరమ్మతులు చేస్తున్నారు. ఈ పనుల కోసం వెదురు బొంగులు వినియోగించడంతో ప్రమాద తీవ్రత పెరిగిందని వాపోతున్నారు. ఈ దుర్ఘటనతో ప్రాంతమంతా దట్టమైన పొగ వ్యాపించగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

massive-fire-incident-in-hong-kong-leads-to-44-people-died

ఈ ఘటనకు సంబంధించి ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేసినట్లు హాంకాంగ్ పోలీసులు తెలిపారని చైనా వార్తా సంస్థ జిన్హువా పేర్కొంది. హాంకాంగ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ జాన్ లీ ఈ ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మరోవైపు 60 అంబులెన్సులను ఘటనాస్థలికి తరలించినట్లు అగ్నిమాపక అధికారులు వెల్లడించారు. దాదాపు 900 మందిని అక్కడి నుంచి సురక్షిత ప్రాంతానికి తరలించినట్లు పేర్కొన్నారు.

కాగా గల్లంతైన వారి కోసం అగ్నిమాపక, రెస్క్యూ బృందాలు గాలింపు చర్యలను ముమ్మరం చేశాయి. ఈ హృదయ విదారక ఘటన మృతుల కుటుంబాలకు, ఆచూకీ తెలియని వారి బంధువులకు తీరని శోకాన్ని మిగిల్చింది. కాగా ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉన్నట్లు ప్రత్యక్ష సాక్షులు తెలుపుతున్నారు. అగ్నిప్రమాదం మొదలై 13 గంటలు గడిచినా మంటలు ఇంకా అదుపులోకి రాకపోవడం సర్వత్రా ఆందోళన కలిగిస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+