North Korea: ఐక్యరాజ్యసమితి ఆంక్షలకు కిమ్ మామ తూట్లు.. రష్యాతో కలిసి ఏం చేస్తోందంటే..
UN Sanctions: ప్రపంచంలో ఉత్తర కొరియా మాత్రం ఇతర దేశాలకు కొంత భిన్నంగా ఉంటుంది. కిమ్ నియంతృత్వ పాలనలో మగ్గిపోతూ, అంతర్జాతీయ నిబంధనలను ఏమాత్రం లెక్కచేయకుండా ఓ రెబల్ దేశంగా ప్రవర్తిస్తుంది. అందుకే ఆ దేశం ఏమి చేసినా అందులో తప్పకుండా ఓ సంచలనం అవుతుంది. గత కొంత కాలంగా ఐక్యరాజ్య సమితి ఆంక్షలను ఏమాత్రం లెక్కచేయకుండా ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తోందని మీడియా నివేదికలు చెబుతున్నాయి.
ఈ ఏడాదిలో ఎనిమిది నెలల పాటు రష్యా నుండి ఉత్తర కొరియా 1 మిలియన్ బ్యారెల్స్ చమురును కొనుగోలు చేసినట్లు UKకు చెందిన ఓపెన్ సోర్స్ సెంటర్ మరియు BBC పేర్కొన్నాయి. ఉపగ్రహ చిత్రాల విశ్లేషణ ఆధారంగా ఈ మేరకు ఓ కథనం ప్రచురించాయి. మార్చి నుంచి దాదాపు 40 కంటే ఎక్కువసార్లు ఉత్తర కొరియా ఆయిల్ ట్యాంకర్లు రష్యా ఫార్ ఈస్టర్న్ పోర్ట్ వోస్తోచ్నీకి వెళ్లినట్లు ఓపెన్ సోర్స్ సెంటర్ వెబ్‌సైట్‌లోని నివేదిక వెల్లడించింది.

'అధిక రిజల్యూషన్ ఉపగ్రహ చిత్రాలు, AIS (ఆటోమేటిక్ ఐడెంటిఫికేషన్ సిస్టమ్) డేటా మరియు సముద్ర గస్తీ మిషన్లచే విడుదల చేయబడిన చిత్రాలు వోస్తోచ్నీ నౌకాశ్రయంలో ఉత్తర కొరియా ట్యాంకర్లు పలుమార్లు ఆయిల్ లోడ్ చేసినట్లు చూపిస్తున్నాయి' అని రిపోర్ట్ పేర్కొంది. అయితే ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి నిబంధనలను ఉల్లంఘించి ఉత్తర కొరియా శుద్ధి చేసిన పెట్రోలియం ఉత్పత్తులను అక్రమంగా దిగుమతి చేసుకుంటోందని ఆరోపించింది.
ఉత్తర కొరియాకు ఏడాదికి 5 లక్షల బ్యారెల్స్ శుద్ధి చేసిన ఆయిల్ దిగుమతికి మాత్రమే అనుమతి ఉంది. ఈ విధంగా అక్రమంగా ఆయిల్ సమకూర్చుకోవడాన్ని నిలువరించేందుకు అమెరికా మరియు దక్షిణ కొరియాలు ఓ కొత్త టాస్క్ ఫోర్స్‌ను సైతం ప్రారంభించాయి. ఈ ఘటనతో UNSCలోని వ్యవస్థాగత సమస్యల కారణంగా రానున్న రోజుల్లో అంతర్జాతీయ ఆంక్షల అమలుపై అనుమానాలు వ్యక్తమయ్యాయి.
వేగంగా మారుతున్న భౌగోళిక కారణాల రీత్యా ప్యాంగ్యాంగ్ మరియు మాస్కోలు దౌత్య మరియు ఆర్థిక పరమైన సంబంధాలను బలపర్చుకున్నాయి. ఈ జూన్‌లో రష్యా అధ్యక్షులు వ్లాదిమిర్ పుతిన్ ఉత్తర కొరియాను సందర్శించి పరస్పర రక్షణ ఒప్పందంపై సంతకం చేశారు. ఇక ఉక్రెయిన్‌తో మాస్కో నెరుపుతున్న యుద్ధానికి మద్ధతుగా
కిమ్ 10 వేల మంది సైనికులను మద్ధతుగా పంపించినట్లు అమెరికా ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలో UK సంస్థలు రిలీజ్ చేసిన రిపోర్ట్ ప్రాముఖ్యత సంతరించుకుంది.












Click it and Unblock the Notifications