ఇది మామూలు లక్ కాదు: ఏకంగా రూ. 13 వేల కోట్ల మెగా లాటరీ గెలుచుకున్నాడు!

వాషింగ్టన్: లాటరీ ద్వారా వేలు, లక్షలు లేదా చివరకు ఒకటి రెండు కోట్లు గెలుచుకోవడం చూస్తుంటాం. అలా ఆ మొత్తం గెలుచుకుంటేనే ఎంతో అదృష్టవంతులని అంటాం. కానీ, ఈ మెగా లాటరీలో మాత్రం ఏకంగా వేల కోట్ల రూపాయలు గెలుచుకోవడం సంచలనంగా మారింది. అమెరికాలో ఓ మెగా లాటరీలో ఓ వ్యక్తి ఏకంగా రూ. 13 వేల కోట్లు గెలుచుకోవడం విశేషం. దీంతో లక్ అంటే ఇతడిదేనని అంటున్నారు.

ఫ్లోరిడా మెగా మిలియన్స్​ లాటరీలో ఓ వ్యక్తి 1.58 బిలియన్​ డాలర్ల ( సుమారు రూ.13 వేల కోట్లు) జాక్‌పాట్ కొట్టారు. కానీ, విజేత వివరాలు తెలియలేదు. అయితే, నెఫ్యూన్ బీచ్​లోని పబ్లిక్స్ స్టోర్ నిర్వహకులు ఈ టిక్కెట్‌​ను విక్రయించారు. కాగా, లాటరీ నిర్వాహకులు.. మంగళవారం డ్రా తీశారు. అందులో 13, 19, 20, 32, 33, 14 నెంబర్ టికెట్‌కు అదృష్టం వరించినట్లు మెగా మిలియన్స్ లాటరీ నిర్వాహకులు తెలిపారు.

Mega Millions jackpot

అమెరికా చరిత్రలో మూడో అతి పెద్ద లాటరీ ప్రైజ్​మనీ ఇదేనని అక్కడి మీడియా వర్గాలు వెల్లడించాయి. కాగా, ఏప్రిల్ 18 నుంచి ఏ ఒక్కరూ​ డ్రాలో గెలుపొందలేరని నిర్వాహకులు తెలిపారు.అయితే డ్రాలో గెలుపొందిన వ్యక్తికి.. ఈ 1.58 బిలియన్​ నగదును ఏడాదికి కొంత మొత్తం చొప్పున 30 ఏళ్ల పాటు చెల్లిస్తారు. అలా కాకుండా ఒకేసారి ఈ మొత్తాన్ని పొందాలంటే.. వారికి సుమారు 783.3 మిలియన్ డాలర్లు (రూ.6400 కోట్లు) మాత్రమే వస్తాయి.

సాధారణంగా ఎక్కువ మంది విజేతలు.. ఇలా ఒకేసారి తీసుకోవడానికే మొగ్గు చూపుతారు. ఇలాంటి లాటరీ ప్రైజ్ మనీనీపై ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు పన్నులు విధిస్తుంటాయి. మెగా మిలియన్ లాటరీ అమెరికా వ్యాప్తంగా 45 రాష్ట్రాలు, వాషింగ్టన్ డీసీ, యూఎస్ వర్జిన్ ద్వీపాల్లో నిర్వహిస్తున్నారు.

Mega Millions jackpot

కాగా, నెప్యూన్ బీచ్ ప్రాంతం.. అట్లాంటిక్ తీరం తూర్పు జాక్సన్​విల్లేకు 16 (26 కిలోమీటర్ల) మైళ్ల దూరంలో ఉంటుంది. ఇక్కడ 7 వేల మంది నివసిస్తుంటారు.
అయితే, గతేడాది జులైలో ఇదే మెగా మిలియన్​ డ్రాలో మరో వ్యక్తి.. 1.28 బిలియన్ డాలర్ల (అప్పటి కరెన్సీ విలువతో పోలిస్తే సుమారు రూ. 10వేల కోట్లు) జాక్​పాట్ తగిలింది. కాగా ఇలినాయ్ రాష్ట్రానికి చెందిన వ్యక్తి ఎవరో ఈ టిక్కెట్ కొన్నట్లు అప్పట్లో నిర్వాహకులు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+