Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

పదవితోపాటే మూడో పెళ్లీ పెటాకులు -ట్రంప్‌కు మెలానియా విడాకులు -వైట్‌హౌజ్ సహాయకురాలి క్లెయిమ్

ఉత్కంఠ భరితంగా సాగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో తుది ఫలితాలకు మరింత సమయం పట్టే అవకాశాలున్నా, ఇప్పటికే మ్యాజిక్ ఫిగర్(270) దాటేయడంతో 46వ ప్రెసిడెంట్ గా జోబైడెన్ గెలుపు ఖరారైంది. అయితే, ఎన్నికల ఫలితాలను ఏమాత్రం విశ్వసించబోనంటోన్న ప్రస్తుత ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్.. 7కోట్ల లీగల్ ఓట్లతో తానే గెలిచానని ప్రకటించుకున్నారు. ట్రంప్ గతంలో కంటే మరింత వివాదాస్పదంగా వ్యవహరిస్తుండటంతో పదవిని, వైట్ హౌస్ ను అంత ఈజీగా వదులుకునేలా లేరనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే, ఓటమి తర్వాత ట్రంప్ వైవాహిక జీవితం మాత్రం కచ్చితంగా కుదుపులకు గురికాబోతున్నట్లు తెలుస్తోంది..

మెలానియా విడాకులు..

మెలానియా విడాకులు..

ట్రంప-మెలానియా వైవాహిక జీవితంలో రాబోయే మార్పుల గురించి ప్రఖ్యాత ‘డెయిలీ మెయిల్' ఆదివారం సంచలన కథనాన్ని ప్రచురించింది. వైట్ హౌజ్ కమ్యూనికేషన్స్ మాజీ డైరెక్టర్ ఒమారసా న్యూమన్ చెప్పిన కీలక అంశాలతో కూడిన ఆ కథనం ప్రస్తుతం సంచలనంగా మారింది. ఒకప్పుడు వైట్ హౌజ్ లో అతి కీలకంగా వ్యవహరించిన ఆమె(ఒమారసా) ట్రంప్ కు చెప్పాపెట్టకుండా ఉద్యోగం మానేశారు. అధికారిక నివాసంలో పరిణామాలను దగ్గరగా పరిశీలించిన వ్యక్తిగానే కాకుండా, మెలానియా మనసెరిగిన మహిళగానూ తానీ విషయాలు చెప్పగలనని, వైట్ హౌజ్ ను వీడిన మరుక్షణమే మెలానియా.. ట్రంప్ కు విడాకులు ఇచ్చేస్తారని ఒమారసా తెలిపారు.

ఇన్నాళ్లూ భరించింది అందుకే..

ఇన్నాళ్లూ భరించింది అందుకే..

‘‘అంతిమంగా అవమానాల నుంచి బయటపడేందుకు మెలానియా డిసైడ్ అయ్యారు. వైట్ హౌజ్ నుంచి బయట పడేందుకు ఆమె ఒక్కో నిమిషం లెక్కిస్తున్నారు. ట్రంప్ దంపతుల 15 ఏళ్ల వైవాహిక జీవితం ఇదివరకే ముగిసింది. కాకుంటే పదవిలో ఉండగా విడాకులివ్వడం మరింత చర్చకు దారితీసే అవకాశముంది కాబట్టి మెలానియా భరిస్తూ వచ్చారు. ఇప్పుడు ట్రంప్ ఓటమి ఖరారైంది కాబట్టి ఆమె విడాకులు తీసుకోవచ్చు. అలా కాకపోతే ట్రంపే ఆమెను ఏదోరకంగా శిక్షించి తీరుతాడు'' అని వైట్ హౌజ్ మాజీ అధికారిణి ఒమారసా చెప్పుకొచ్చారు. నిజానికి..

ఆయన గెలుపు ఆమెకు నచ్చలేదు..

ఆయన గెలుపు ఆమెకు నచ్చలేదు..

నిజానికి ట్రంప్-మెలానియాలది transactional marriage(పరస్పర లాభం చూకూరే ఒప్పంద వివాహం) అని, ట్రంప్ తొలిసారి అధ్యక్షుడిగా గెలిచిన సందర్భంలో(2016లో) మెలానియా కన్నీటిపర్యంతమయ్యారని, అతని విజయాన్ని ఆమె ఊహించలేకపోయారని, వైట్ హౌజ్ కు వెళ్లడం ఇష్టం లేకే, కొడుకు బారోన్ ట్రంప్ చదువు కోసం ఫ్లోరిడాలోనే ఉండి, ఆలస్యంగా వాషింగ్టన్ వెళ్లారని మెలానియా సన్నిహితురాలు ఒకరు చెప్పిన అభిప్రాయాన్ని కూడా ‘డెయిలీ మెయిల్' ప్రస్తావించింది. అంతేకాదు..

చిన్న కొడుక్కి ఆస్తిలో వాటా..

చిన్న కొడుక్కి ఆస్తిలో వాటా..

ట్రంప్ నుంచి మెలానియా విడాకులు తీసుకోబోతున్నట్లు ప్రచారం జరుగుతున్న సమయంలోనే.. మెలానియా మాజీ సలహాదారు, ప్రముఖ ఫ్యాషన్ ఎగ్జిక్యూటివ్ స్టెఫనీ వాకోఫ్ సైతం కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘విడాకుల ఒప్పందానికి సంబంధించి ట్రంప్, మెలానియాల మధ్య అనేక చర్చోపచర్చలు జరిగాయి. నిజానికి వైట్ హౌజ్ లో వాళ్లిద్దరికీ సెపరేట్ బెడ్ రూమ్స్ ఉన్నాయి. వాళ్లది లావాదేవీల విహావం మాత్రమే'' అని స్టెఫనీ పేర్కొన్నారు. విడాకుల ఒప్పందంలో భాగంగా మెలానియా తన కొడుకు బారోన్ ట్రంప్ కు ఆస్తిలో వాటా కేటాయింపులపైనా ట్రంప్ తో చర్చలు, లాయర్లతో లేఖల ద్వారా సంప్రదింపులు జరిపినట్లు కథనంలో పేర్కొన్నారు. అందులో భాగంగానే..

ఒప్పందంలో కీలక నిబంధనలు..

ఒప్పందంలో కీలక నిబంధనలు..

విడాకుల ఒప్పందంలో భాగంగా కొడుక్కి ట్రంప్ ఆస్తిలో వాటాతోపాటు మరో కీలకమైన నిబంధన కూడా ఉన్నట్లు తెలుస్తోంది. మెలానియా.. ట్రంప్ నుంచి విడిపోయిన తర్వాత ఆయన గురించి బహిరంగ వ్యాఖ్యలు చేయడంగానీ, పుస్తకాలు రాయడం లేదా ఇంటర్వ్యూల్లో వైవాహిక జీవితం గురించి ప్రస్తావన చేయకూడదనే నిబంధన కూడా ఉన్నట్లు ‘డెయిలీ మెయిల్' పేర్కొంది. ట్రంప్ రెండో భార్య మార్లా మాపెల్స్ కూడా ఈ ఒప్పందానికి అంగీకరించిన తర్వాతే విడాకులు తీసుకున్నారని, ఇప్పుడు మెలానియా వంతని కథనంలో రాశారు. అయితే..

15ఏళ్లకు పెళ్లి పెటాకులు.. నిజమేనా?

15ఏళ్లకు పెళ్లి పెటాకులు.. నిజమేనా?

అప్పటికే ఇద్దరు భార్యల(ఇవానా, మార్లా) నుంచి విడిపోయిన ట్రంప్.. 2005లో స్లోవేయిన్-అమెరికన్ మోడల్ మెలానియాను మూడో పెళ్లి చేసుకున్నారు. గతంలోనూ వారి వైవాహిక బంధంలో లుకలుకలపై పుకార్లు వచ్చాయి. ఆ జంట వైట్ హౌజ్ కు షిఫ్ట్ అయిన తర్వాత అవి మరింతగా వ్యాప్తి చెందాయి. మీడియా, సోషల్ మీడియా కథనాలను లైట్ తీసుకునే మెలానియా.. ట్రంప్ తో తన రిలేషన్ భేషుగ్గా ఉందని కొన్నిసార్లు వ్యాఖ్యానించారు. ‘మేం హ్యాపీగా ఉంటాం.. మా మధ్య అసలు ఆర్గ్యుమెంట్లే ఉండవు''అని ట్రంప్ ఓ సందర్భంలో చెప్పారు. కాగా, 15 ఏళ్ల పెళ్లి బంధానికి ఫుల్ స్టాప్ పెడుతూ, ట్రంప్ నుంచి మెలానియా విడిపోబోతున్నారన్న కథనం అక్షరాలా నిజమేనా? కాదా? అనేది రూఢీకాలేదు. ఏదిఏమైనా పదవిని కోల్పోతున్న సందర్భంలోనే ట్రంప్ పెళ్లి పెటాకుల వార్తలు గుప్పుమనడం గమనార్హం. ముగ్గురు భార్యల ద్వారా ట్రంప్ కు ఐదుగురు పిల్లున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+