Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఓటమిని అంగీకరించి హుందాగా..: డొనాల్డ్ ట్రంప్ వ్యవహారంపై మెలానియా ట్రంప్

వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఓటమిపాలైనప్పటికీ ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన ఓటమిని అంగీకరించడం లేదు. ఈ నేపథ్యంలో అనేక మంది ట్రంప్ వ్యవహారశైలిని తప్పుబడుతున్నారు. తాజాగా, ట్రంప్ వైఖరిని ఆయన భార్య మెలానియా ట్రంప్ కూడా వ్యతిరేకించారు.

ఓటమిని అంగీకరించి హుందాగా..

ఓటమిని అంగీకరించి హుందాగా..

తాజా ఎన్నికల ఫలితాలపై అమెరికా ప్రథమ మహిళ బహిరంగంగా ఏ వ్యాఖ్యలు చేయనప్పటికీ.. మెలానియా తన అభిప్రాయాన్ని వ్యక్తిగతంగా వెల్లడిచేశారు. డొనాల్డ్ ట్రంప్ తన ఓటమిని అంగీకరించి హుందాగా వ్యవహరించాలని కోరినట్లు తెలిసింది.ఫలితాలు వెలువడిన అనంతరం ఓడినవారు దానిని అంగీకరిస్తూ.. ఓటమి అంగీకర ప్రసంగం చేయడం అమెరికా సంప్రదాయం.. కానీ, ట్రంప్ మాత్రం అలా చేయడం లేదు.

ట్రంప్ ఏం చేయాలనుకుంటున్నారు?

ట్రంప్ ఏం చేయాలనుకుంటున్నారు?

ఈ క్రమంలో ట్రంప్ వ్యవహారశైలిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ట్రంప్ అహంకారపూరితంగా వ్యవహరిస్తున్నారంటూ కొందరు అంటుండగా, ఏదైనా వ్యూహం రచిస్తున్నారా? అనే అనుమానాన్ని మరికొందరు వ్యక్తం చేస్తున్నారు. కాగా, తాజా ఎన్నికల ఫలితాల్లో రిపబ్లికన్ల ఓటమి, జో బైడెన్ గెలుపుపై న్యాయస్థానంలో పోరాడాలనే అభిప్రాయానికి ట్రంప్ మద్దతుదారులు కూడా మొగ్గు చూపుతుండటం గమనార్హం.

Recommended Video

    US Election 2020: A victory for “we the people” - Joe Biden | Oneindia Telugu
    ట్రంప్ తీరుపై భిన్నవాదనలు.. మెలానియా మాటైనా వింటారా?

    ట్రంప్ తీరుపై భిన్నవాదనలు.. మెలానియా మాటైనా వింటారా?

    అయితే, ఓటమిని అంగీకరించి, గౌరవప్రదంగా నిష్క్రమిస్తేనే సమంజసంగా ఉంటుందని ట్రంప్ అల్లుడు, అధ్యక్షుడి సీనియర్ సలహదారు అయిన జరేడ్ కుష్నర్ అభిప్రాయపడుతున్నారు. కాగా, కరోనావైరస్ సోకడంతో భర్త తరపున ఎన్నికల ప్రచార కార్యక్రమంలోకి మెలానియా ఆలస్యంగా వచ్చిన విషయం తెలిసిందే. అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలపై కోర్టులోనే తేల్చుకుంటామంటున్న ట్రంప్.. తన సతీమణి మెలానియా మాటైనా వింటారో లేదో త్వరలోనే తేలనుంది.

    కాగా, ఇటీల జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రాటిక్ అభ్యర్థి జో బైడెన్ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు, రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి డొనల్డ్ ట్రంప్ ఓటమిపాలయ్యారు. జో బైడెన్‍‌కు అత్యధికంగా 290 ఎలక్టోరల్ ఓట్లు రాగా, డొనాల్ ట్రంప్‌నకు 214 ఓట్లు వచ్చాయి.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+