Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

విమానంలో విడ్డూరం: విండో షేడ్ కోసం ఫైట్... వీడియో వైరల్, నెటిజన్ల ఫైర్

ఎక్కడ జరిగిందో తెలియదు, ఏ విమానమో స్పష్టత లేదు. కానీ ప్లైట్ గగనతలంలో పయనిస్తున్న సమయంలో ఇద్దరూ గొడవపడ్డారు. విండో షేడ్ కోసం వారిద్దరూ పిల్లల మాదిరిగానే ఫైట్ జరిగింది. ఒకరు వేయడం, వెంటనే తీయడం జరిగింది. ఈ ఘటనను కొందరు వీడియో తీసి ఇన్‌స్ట్రాగ్రామ్‌లో పోస్ట్ చేయడంతో తెగ వైరలవుతోంది.

అంతా సైలంట్..

అంతా సైలంట్..

విమానం టేకాఫ్ అయ్యింది. ప్రయాణికులంతా స్తబ్ధుగా ఉన్నారు. సిబ్బంది కూడా తమ పనిలో మునిగిపోయారు. కానీ ఇద్దరి మధ్య మాటల యుద్ధం జరుగుతుంది. ఒకతను తన కిటీకి వద్ద విండో షేడ్ తీయడంతో గొడవకు కారణమైంది. వెనకాలే కూర్చొన్న పెద్దాయన దానిని మూయడం వారి మధ్య డిస్కషన్ జరిగింది. అలా మూయడం, తీయడంతో ఇద్దరి మధ్య వాగ్వివాదం పీక్‌ స్టేజీకి చేరింది.

సిబ్బంది వచ్చినా..

వారి గొడవతో సిబ్బంది కూడా వచ్చారు. ఏం జరిగిందని ఆరా తీశారు. విండో షేడ్ గురించి తెలియజేయగా.. ఆమె వారికి సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. కానీ వారిద్దరూ వినిపించుకోలేదు. అలానే గొడవపడ్డారు. ఆ వీడియో నిడివి 2 నిమిషాలు పైగానే ఉంది. ఆ వీడియో సోషల్ మీడియాలో తెగ ట్రోలవుతుంది. ఇప్పటికే 4 లక్షల మంది చూశారు. 2 వేల మంది కామెంట్ చేశారు. ఒక్కరోజులోనే ఆ వీడియోకు జనాలు ఈ స్థాయిలో స్పందించడం ప్రాధాన్యం సంతరించుకుంది.

తీయడం, వేయడం

తీయడం, వేయడం

వీడియోలో ముందు సీట్లో ఉన్న వ్యక్తి విమానం నుంచి వ్యూ చూడటానికి పదే పదే తీస్తున్నాడు. వెనకాల ఉన్న పెద్దాయన భయపడ్డారెమో కానీ.. మూయండి అంటూ బతిమిలాడారు. మూసేయడంతో.. ప్రతీసారి యువకుడు తెరిచాడు. దీంతో వారి మధ్య కాసేపు గొడవ జరిగింది. పక్కన ఉన్న ప్రయాణికులెవరూ వారిని పట్టించుకోకపోవడం విశేషం.

అపరిపక్వతకు నిదర్శనం

అపరిపక్వతకు నిదర్శనం

ఈ వీడియోపై నెటిజన్లు భిన్నంగా స్పందించారు. ఇది వారిద్దరి అపరిపక్వతకు నిదర్శనం అంటూ కామెంట్లు చేశారు. దాదాపు చాలామంది విండో షేడ్ మూస్తోన్న వ్యక్తిదే తప్పని కామెంట్లు పెట్టారు. వెనక సీట్లో కూర్చొన్న వ్యక్తి ప్రవర్తన సరికాదు, ఇతరుల విండో షేడ్‌ను ఎలా మూసివేస్తారని ప్రశ్నించారు. అదీ సంస్కారం కాదు కదా.. గుడ్డిగా మూయడంతో ఎదుటివారిని అవమానించినట్టే అవుతుందని తెలిపారు.

కావాలనే..

కావాలనే..

మరికొందరు వారిద్దరూ కావాలనే గొడవ పడినట్టు ఉందని అన్నారు. వీడియోనే సోషల్ మీడియాలో పెట్టి లైక్లు, కామెంట్ల కోసం ప్రయత్నించారని ఆరోపించారు. ఇది నిజమైన గొడవ కాదని చాలామంది అభిప్రాయపడ్డారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+