సత్య నాదెళ్ల జీతం రూ.847 కోట్లు
మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల వేతనం అమాంతం పెరిగింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఏకంగా 22 శాతం పెరుగుదల చోటు చేసుకుంది. ఆయన అందుకుంటోన్న జీతం 96.5 మిలియన్ డాలర్లు. మన కరెన్సీతో పోల్చుకుంటే 847.31 కోట్ల రూపాయలు. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ను విజయవంతంగా అడాప్ట్ చేసుకోవడం, దాని వల్ల మైక్రోసాఫ్ట్ వృద్ధి చెందడం దీనికి ప్రధాన కారణం. ఈ భారీ వేతన పెరుగుదల మధ్య లేఆఫ్స్ కొనసాగుతోండటం.. నైతిక వివాదాలకు దారి తీసినట్టయింది.
ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో మైక్రోసాఫ్ట్ ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తోంది.. అంచనాలకు అందని విధంగా దూసుకుపోతోంది. సత్య నాదెళ్ల వేతనం భారీగా పెరగడానికి ఇదే ప్రధాన కారణమైందని ప్రాక్సీ రిపోర్ట్ వెల్లడించింది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఆయన వేతనం 22 శాతం పెరిగి 847.31 కోట్ల రూపాయలకు చేరింది. గత ఏడాది ఆయన 79.1 మిలియన్ డాలర్ల వేతనం తీసుకోగా.. ఇప్పుడది 96.5 మిలియన్ డాలర్లకు చేరింది. ఇందులో 84 మిలియన్ డాలర్లకు పైగా వేతనం స్టాక్ అవార్డుల రూపంలోనే ఉన్నాయి.

దీనికి అదనంగా ఆయనకు మరో 9.5 మిలియన్ డాలర్ల మేర నగదు ప్రోత్సాహకాలు లభించాయి. మైక్రోసాఫ్ట్ స్టాక్ ఈ సంవత్సరం ఇప్పటివరకు 23 శాతం పెరిగింది. ఎస్ అండ్ పీ 500 లాభం 15 శాతాన్ని మించిపోయింది. మూడేళ్లుగా మైక్రోసాఫ్ట్ షేర్ల ధరలు రెట్టింపు అయ్యాయి. AIని పూర్తి స్థాయిలో అడాప్ట్ చేసుకుంటోండటం, భారీ పెట్టుబడులను మళ్లించడం వంటి చర్యల వల్ల మైక్రోసాఫ్ట్ షేర్ల రేట్లు భారీగా పెరుగుతూ వస్తోన్నాయి.
దీనికి తోడు OpenAIతో భాగస్వామ్యాన్ని కుదుర్చుకుంది మైక్రోసాఫ్ట్. అలాగే అజూర్ క్లౌడ్ సేవలను విస్తరించడం కీలక పాత్ర పోషించింది. మైక్రోసాఫ్ట్ 365లోని కోపైలట్ టూల్స్ నుండి అజూర్ ఎంటర్‌ప్రైజ్ ఆఫర్ల వరకు ప్రతిచోటా AIని అనుసంధానించడం దీనికి ప్రధాన కారణం. దీనికి అనుగుణంగా షేర్ల రేట్లు పెరుగుతోన్నాయి. ఈ ఏడాది జూలైలో విడుదలైన క్యూ1 రిజల్ట్ ప్రకారం కంపెనీ ఏడాదికి 18 శాతం ఆదాయ వృద్ధిని నమోదు చేసింది.
మూడేళ్ల కాలంలో ఈ స్థాయిలో ఈ స్థాయిలో వృద్ధిరేటును నమోదు చేయలేదు మైక్రోసాఫ్ట్. క్లౌడ్ కంప్యూటింగ్ వల్లే ఈ స్థాయిలో ఆదాయాన్ని ఆర్జించింది. వాల్ స్ట్రీట్ అంచనాలను సైతం దాటేసిందీ రిజల్ట్. వచ్చే వారం క్యూ1 ఫలితాలు వెలువడనున్నాయి. ఈ నేపథ్యంలో ఇన్వెస్టర్లు అజూర్‌పై నిశితంగా దృష్టి సారిస్తున్నారు. దీనికి అనుగుణంగా సత్య నాదెళ్ల వేతనం పెరుగుదల కనిపించింది. తన వేతనాన్ని తగ్గించుకోవడానికి సత్య నాదెళ్ల సుముఖత చూపారని తెలుస్తోంది.












Click it and Unblock the Notifications