దయచేసి మా వాళ్లను వదిలేయండి: ట్రంప్‌కు మైక్రోసాఫ్ట్ మొర
ఏడు ముస్లీం మెజార్టీ దేశాల నుంచి నిషేధం, ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ నేపథ్యంలో టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్‌కు మొర పెట్టుకుంది.
వాషింగ్టన్: ఏడు ముస్లీం మెజార్టీ దేశాల నుంచి నిషేధం, ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ నేపథ్యంలో టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్‌కు మొర పెట్టుకుంది. తమ కంపెనీకి చెందిన ఉద్యోగాలను మినహాయించాలని విజ్ఞప్తి చేసింది.
తమ ఉద్యోగులను ట్రావెల్ నిబంధనల నుంచి మినహాయించాలని, వీసా, ఇమిగ్రేషన్, బార్డర్ సెక్యూరిటీ చట్టాలపై ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ను తమకు వర్తించకుండా ఆదేశాలు ఇవ్వాలని శుక్రవారం నాడు మైక్రోసాఫ్ట్ మొరపెట్టుకుంది.
ఈ మేరకు యూఎస్ విదేశాంగ మంత్రి రెక్స్ టిల్లర్ సన్, హోంల్యాండ్ సెక్యూరిటీ సెక్రటరీ జాన్ కెల్లీలకు, మైక్రోసాఫ్ట్ చీఫ్ లీగల్ ఆఫీసర్ బ్రాడ్ ఫోర్డ్ ఎల్ స్మిత్ లేఖ రాశారు.

తమ సంస్థలో పని చేస్తున్న వారిలో 76 మంది ఉద్యోగులు, వారిపై ఆధారపడిన 41 మంది నాన్ ఇమిగ్రెంట్లు, ట్రంప్ కార్యనిర్వాహక ఆదేశాలతో ఇబ్బందులు పడుతున్నారన్నారు.
ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులతో తాము సంప్రదించామని, వారంతా భయపడుతున్నారని, కుటుంబాల నుంచి తమ ఉద్యోగులు విడిపోవాల్సిన పరిస్థితిని కల్పించవద్దని స్మిత్ కోరారు.
ఉద్యోగ విధుల నిమిత్తం వారు విదేశీ ప్రయాణాలు సాగించాల్సి వస్తుందని, వారు తిరిగి అమెరికాలో కాలుమోపేందుకు అనుమతించాలని విజ్ఞప్తి చేశారు. ఎటువంటి నేర చరిత్రా లేని వారిని మాత్రమే తాము ఉద్యోగులుగా తీసుకుంటున్నామని, వారితో ఎలాంటి ఇబ్బందులూ రావని హామీ ఇచ్చారు.
-
కుప్పకూలుతున్న అమెరికా ఫైటర్ జెట్స్.. వెనక్కు తగ్గిన ట్రంప్..!! -
తోకముడిచిన ట్రంప్, అమెరికా పరువు తీసిన ఇరాన్ రియాక్షన్ -
Donald trump: ట్రంప్ ప్రకటనతో కుప్పకూలిన చమురు, గ్యాస్ ధరలు..! -
ట్రంప్ కు ముందు నుయ్యి, వెనుక గొయ్యి-ఎలాగో చెప్పిన మాజీ రక్షణమంత్రి..! -
Trump: ట్రంప్ ప్రకటనపై స్పందించిన కేంద్రం- కీలక వ్యాఖ్యలు..! -
ఇజ్రాయెల్ కు షాకిచ్చిన ట్రంప్, ఇప్పుడు ఏం చేద్దాం? -
యుద్ధం ఆగిపోయింది. ట్రంప్ సంచలన ప్రకటన -
షాకింగ్ వీడియో: అమెరికా F-15 ఫైటర్ జెట్ ను పేల్చేసిన ఇరాన్ -
Iran: ట్రంప్ అల్టిమేటం వేళ హార్ముజ్ పై ఇరాన్ కీలక నిర్ణయం-ఆ కండిషన్ తో ..! -
డొనాల్డ్ ట్రంప్ సడన్ యూటర్న్- యుద్ధ విరామం -
భారత్ కు బిగ్ షాక్- హార్ముజ్ జలసంధి పూర్తిగా మూసివేయనున్న ఇరాన్ -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్!










Click it and Unblock the Notifications