Military Rankings: ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన సైన్యం అగ్రరాజ్యానిదే.. మరి భారత్ స్థానం ఎంతంటే?

Military Rankings: 2025 ఏడాదికి సంబంధించి ప్రపంచంలోనే అత్యంత శక్తవంతమైన సైనిక శక్తి కలిగిన దేశాల జాబితా విడుదల అయింది. గ్లోబల్ ఫైర్ పవర్ ఇండెక్స్(GFP Index)లో భారతదేశం ఒక ముఖ్యమైన సైనిక శక్తిగా వర్ణించబడింది. గ్లోబర్ ఫైర్ పవర్ ఇండెక్స్ లో ప్రపంచంలోని టాప్-5 అత్యంత శక్తివంతమైన సైనిక శక్తులలో ఇండియా చేర్చబడింది. సైనిక విభాగాలు, ఆర్థిక పరిస్థితి, లాజిస్టిక్స్ సామర్థ్యాలను సహా 60కి పైగా అంశాల అంచనా ఆధారంగా ర్యాంకింగ్ లు రూపొందించబడ్డాయని గ్లోబర్ ఫైర్ పవర్ వెబ్ సైట్ పేర్కొంది.

ప్రపంచ 4వ స్థానంలో భారత్
గ్లోబల్ ఫైర్ పవర్ ఇండెక్స్ ర్యాంకింగ్ ప్రకారం.. అగ్రరాజ్యమైన అమెరికా సైన్యం 0.0744 స్కోరుతో ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన సైనిక శక్తిగా మొదటి స్థానంలో నిలిచింది. ఆ తర్వాత రష్యా, చైనాలు ఉన్నాయి. భారత్ ప్రపంచంలోనే నాల్గవ అత్యంత శక్తివంతమైన సైనిక శక్తిగా నిలిచింది. భారత్ స్కోరు 0.1184గా ఉంది. దక్షిణ కొరియా టాప్-5 శక్తివంతమైన సైనిక శక్తులలో చోటు దక్కించుకుని ఐదో స్థానంలో నిలిచింది.

Military Rankings 2025 World s Most Powerful Armies Where Does India Stand

12వ స్థానంలో పాకిస్థాన్
భారత దాయాది దేశమైన పాకిస్థాన్ వద్ద అణ్వాయుధాలు ఉన్నప్పటికీ.. ప్రపంచంలోని టాప్-10 సైనిక శక్తులలో కూడా చోటు దక్కలేదు. గ్లోబల్ ఫైర్ పవర్ ఇండెక్స్ లో పాకిస్థాన్ బ్రెజిల్ కంటే దిగువన 12వ స్థానంలో ఉంది. వైమానిక దళం, నావికాదళం పరంగా కూడా ఇండియా పొరుగు దేశమైన పాకిస్థాన్ కంటే చాలా ముందుంది.

వెనుకబడిన పాక్..
పాకిస్థాన్ వైమానిక దళం ర్యాంకింగ్ లో 7వ స్థానంలో ఉండగా.. భారత వైమానిక దళం టాప్-5లో చోటు దక్కించుకుని నాల్గవ స్థానంలో నిలిచింది. భారత్ కు చెందిన నేవీ ప్రపంచంలో 6వ స్థానంలో ఉండగా.. పాకిస్థాన్ నావికాదళం 27వ స్థానంలో ఉంది. భారత మొత్తం సైనిక బలం 51.37 లక్షలు, ఇందులో 14.55 లక్షల మంది క్రియాశీల సైనికులు, 11.55 లక్షల మంది రిజర్వ్ సైనికులు ఉన్నారు. భారత ఆర్మీలో 21.97 లక్షల మంది సైనికులు, వైమానిక దళంలో 310575 మంది, నౌకాదళంలో 142251 మంది సైనికులు ఉన్నారు. ఇండియాలో 25.27 లక్షల మంది పారామిలిటరీ సిబ్బంది ఉన్నారు.

పాకిస్థాన్ మొత్తం సైనిక బలం 17.04 లక్షలు కాగా.. 6.54 లక్షల మంది క్రియాశీల సైనికులు, 5.50 లక్షల మంది రిజర్వ్ సైనికులు ఉన్నారు. పాకిస్థాన్ సైన్యంలో 13.11 లక్షల మంది సైనికులు, వైమానిక దళంలో 78,128 మంది, నావికాదళంలో 124800 మంది సైనికులు ఉన్నారు. పాకిస్థాన్ లో 5 లక్షల పారామిలిటరీ దళాలు ఉన్నాయి. గ్లోబల్ మిలిటరీ పవర్ ర్యాంకింగ్ లో బ్రిటన్ ఆరో స్థానంలో, ఫ్రాన్స్ 7వ స్థానంలో, జపాన్ 8 స్థానంలో, టర్కీ 9వ స్థానంలో,ఇటలీ 10వ స్థానంలో నిలిచాయి.

అత్యంత శక్తివంతమైన సైనిక శక్తి కలిగిన టాప్-10 దేశాలు ఇవే..
1.అమెరికా
2.రష్యా
3.చైనా
4. భారత్
5.దక్షిణ కొరియా
6.బ్రిటన్
7.ఫ్రాన్స్
8.జపాన్
9.టర్కీ
10.ఇటలీ

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+