రివర్స్: ఐఎస్ఐఎస్ ఫైటర్స్ తలలు నరికేశారు
అఫ్ఘనిస్థాన్: ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్ఐఎస్) ఉగ్రవాదుల ఆగడాలకు అడ్డుకట్ట వెయ్యడానికి అఫ్ఘనిస్థాన్ లోని గ్రామస్తులు సిద్దం అయ్యారు. ఇన్నాళ్లు ఐఎస్ఐఎస్ ఆగడాలు చూశాం. అయితే అలాంటి కిరాతకులను పట్టుకుని వారి తలలు నరికి ఊళ్లో ప్రదర్శించారు.
అఫ్ఘనిస్థాన్ లో తాలిబన్లదే రాజ్యం. అక్కడ వారు చెప్పిందే వేదం, వారు గీసిన గీత దాటితే ప్రాణాలు తీసేస్తారు. ఇటీవల కాలంలో ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు అఫ్ఘనిస్థాన్ లోని పలు గ్రామల్లోకి చొరబడి పట్టు సాధించడానికి ప్రయత్నిస్తున్నారు.
అఫ్ఘనిస్థాన్ లోని జలాలాబాద్ ప్రాంతంలో కొన్ని రోజుల క్రితం చోరబడిన ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు మిలీషియా తెగకు చెందిన నలుగురు సభ్యులను బందీలుగా పట్టుకుని వారి తలలు నరికి ఊళ్లో ఊరేగించి గ్రామస్తులను హెచ్చరించారు.

గ్రామస్తులు ప్రతీకారం కోసం ఎదురు చూశారు. ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు మళ్లీ ఆదివారం గ్రామంలోకి చోరబడ్డారు. గ్రామస్తులు ఎదురు తిరిగి నలుగురు ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులను ప్రాణాలతో పట్టుకున్నారు. నలుగురిని నడి రోడ్డు మీదకు తీసుకు వచ్చి తలలు నరికేశారు.
తరువాత ఊళ్లో మెయిన్ రోడ్డులో నలుగురి తలలు ప్రదర్శించారు. విషయం తెలుసుకున్న ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు అటువైపు కన్నెత్తి చూడటానికి భయపడుతున్నారు. అఫ్ఘనిస్థాన్ పార్లమెంటు డిప్యూటీ స్పీకర్ హాజీ జహీర్ కు అత్యంత నమ్మకస్థులైన మిలీషియా సభ్యులు ఐఎస్ఐఎస్ ఉగ్రవాదుల తలలు నరికేశారు.
మిలీషియా సభ్యులు తాలిబన్లతో, ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులతో పోరాడుతున్నారు. జలాలాబాద్ లో ఉద్రిక్తపరిస్థితులు ఎర్పడ్డాయి. మిలీషియా సభ్యులు ఐఎస్ఐఎస్ ఉగ్రవాదుల తలలు నరకిన ఘటనను డిప్యూటీ స్పీకర్ హాజీ జహీర్ సమర్ధించారని తెలిసింది.












Click it and Unblock the Notifications