విశ్వసుందరి -2025గా " ఫాతిమా బాష్ "... ఆమె ఎవరంటే ???

అత్యంత ప్రతిష్ఠాత్మకంగా జరిగిన 74వ మిస్ యూనివర్స్-2025 పోటీల్లో "ఫాతిమా బాష్" విశ్వసుందరి కిరీటం దక్కించుకుంది. థాయ్‌లాండ్ వేదికగా జరిగిన ఈ గ్రాండ్ ఫినాలేలో 25 ఏళ్ల మిస్ మెక్సికో ఫాతిమా విజేతగా నిలిచింది. మొత్తంగా ఈ పోటీల్లో 121 దేశాల అందగత్తెలు పాల్గొన్నప్పటికీ.. మిస్ యూనివర్స్ గా ఆమె ఈ అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. ఇక రన్నరప్‌గా మిస్ డెన్మార్క్ విక్టోరియా క్జేర్ థెల్.. సెకండ్ రన్నరప్‌గా మిస్ నైజీరియా చియెనెల్ ఉవాజ్ నిలిచారు.

ఫాతిమా ఎవరంటే..?

ఫాతిమా బాష్.. మెక్సికో లోని తబాస్కో రాష్ట్రానికి చెందిన యువతి. దేశ చరిత్రలో ఇదే నాలుగో మిస్ యూనివర్స్ కిరీటం కాగా.. తబాస్కోనుంచి టైటిల్‌ను గెలుచుకున్న మొదటి వ్యక్తిగా ఫాతిమా నిలిచింది. ఫైనల్ రౌండ్స్‌లో డెన్మార్క్, నైజీరియా, థాయ్‌లాండ్, వెనిజులా అందగత్తెలతో కలిసి టాప్-5లో నిలిచిన ఫాతిమా కిరీటాన్ని దక్కించుకుంది. ఫాతిమా ఈ టైటిల్‌ను గెలవడంతో మెక్సికో మొత్తం ఉత్సాహంలో మునిగిపోయింది.

miss-mexico-fatima-bash-won-miss-universe-2025-title

టాప్-5లో నిలిచిన ఫాతిమా ఈవెనింగ్ గౌన్, కశ్చన్ అండ్ ఆనర్స్ విభాగాల్లో అదరగొట్టింది. జడ్జీలు అడిగిన చివరి ప్రశ్నకు.. నమ్మకం, ధైర్యం, ప్రేమ ఇవే నా జీవిత స్తంభాలు అని చెప్పడంతో ఆమెకు విశ్వసుందరీ కిరీటం దక్కింది. ఈవెంట్లో గత సంవత్సరం మిస్ యూనివర్స్ కిరీటం గెలుచుకున్న డెన్మార్క్ భామ విక్టోరియా హెల్విగ్, స్టేజ్‌పై ఫాతిమా బాష్‌కు కొత్త కిరీటాన్ని ధరింపజేశారు.

నిరాశపరిచిన మణిక..

ఈ పోటీల్లో భారత్‌ తరఫున రాజస్థాన్‌లోని శ్రీ గంగానగర్‌కు చెందిన మణిక విశ్వకర్మ పాల్గొన్నారు. టాప్‌ 30 వరకు చేరుకున్న ఈమె.. టాప్‌ 12లో ఛాన్స్ దక్కించుకోలేకపోయింది. ఫైనల్స్‌లో భాగంగా జరిగిన స్విమ్‌సూట్ రౌండ్‌లో మానిక ప్రదర్శన న్యాయనిర్ణేతలను ఆకట్టుకోవడంలో విఫలమైంది. తెల్లటి మోనోకినీలో కనిపించిన ఆమె.. ఆ రౌండ్‌లో తగినంతగా రాణించలేకపోవడంతో పోటీ నుంచి నిష్క్రమించింది. మణిక టాప్ స్థాయిలోకి రాలేనప్పటికీ.. భారత ప్రతినిధిగా అంతర్జాతీయ వేదికపై పోటీ చేసి ఆ స్థాయికి రావడం కూడా గొప్ప విషయం అంటూ పలువురు ప్రముఖులు ప్రశంసిస్తున్నారు.

miss-mexico-fatima-bash-won-miss-universe-2025-title
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+