Viral Video: ఆ మాత్రం చూసుకోరా.. అందాల భామకు తప్పిన ఘోర ప్రమాదం!

Viral Video: మిస్ యూనివర్స్ 2025 పోటీలు థాయ్ లాండ్‌లో జరుగుతున్న తరుణంలో ఫైనల్‌కు కేవలం రెండు రోజుల ముందు (నవంబర్ 19న) ఒక ప్రమాదం చోటుచేసుకుంది. ఈ పోటీలో పాల్గొన్న మిస్ జమైకా ఈవెనింగ్ గౌన్ రౌండ్‌లో నడుస్తూ ఒక్కసారిగా స్టేజీ పైనుంచి కింద పడిపోయింది. ఈ ఘటనతో అక్కడి వారు భయపడ్డారు. మిస్ యూనివర్స్ 2025 ఫైనల్స్ జరగడానికి సరిగ్గా రెండు రోజుల ముందు ఈ సంఘటన జరిగింది.

ఈ ఈవెంట్‌కు సంబంధించిన ఈవెనింగ్ గౌన్ విభాగంలో మిస్ జమైకా (గాబ్రియెల్) నారింజ రంగులో ఉన్న చాలా అందమైన గౌను, హై హీల్స్‌తో వేదికపై నడుస్తోంది. ఆమె నడక చాలా ఆకర్షణీయంగా ఉన్నప్పటికీ, అనుకోకుండా స్టేజీ అంచుకు వచ్చింది. 28 ఏళ్ల గాబ్రియెల్ ఒక అడుగును మిస్ చేసి.. ఒక్కసారిగా వేదిక పైనుంచి కింద పడిపోయింది. ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ప్రమాదం జరిగిన తర్వాత ఆమెను స్ట్రెచర్‌పై వేదిక నుంచి ఆసుపత్రికి తరలించారు.

Miss Universe Shock Miss Jamaica Falls Off Stage During Evening Gown Round Video Goes Viral

ఆస్పత్రిలో చికిత్స.. మిస్ జమైకా క్షేమం
మిస్ యూనివర్స్ జమైకా ఆర్గనైజేషన్ నవంబర్ 19న ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ ద్వారా ఈ వివరాలను వెల్లడించింది. ప్రమాదం జరిగిన వెంటనే ఆమెను చికిత్స కోసం పావోలో రంగసిత్ ఆస్పత్రికి తరలించారు."డాక్టర్లు ఆమెకు ఎలాంటి ప్రాణాంతకమైన లేదా తీవ్రమైన గాయాలు కాలేదని నిర్ధారించారు. అయితే ఆమె పూర్తిగా కోలుకునేందుకు అవసరమైన పరీక్షలు కొనసాగుతున్నాయి" అని ఆ సంస్థ తెలిపింది.

మిస్ యూనివర్స్ జమైకా ఆర్గనైజేషన్ తమ అభిమానులకు, మద్దతుదారులకు ధన్యవాదాలు తెలియజేసింది. "అందరూ ధైర్యంగా ఉండండి, ఆమె త్వరగా కోలుకోవాలని ప్రార్థించండి. ఆమెకు అవసరమైన వైద్య సహాయం అందుతున్నంత వరకు సానుకూల సందేశాలు పంపాలని అభ్యర్థిస్తున్నాం" అని వారు కోరారు. మొత్తంగా మిస్ జమైకాకు ప్రాణాంతకమైన లేదా తీవ్రమైన గాయాలు ఏమీ కాలేదని నిర్ధారణ కావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+