మిస్ వరల్డ్ 2018: ప్రపంచ సుందరిగా మెక్సికో వెనెస్సా, కిరీటం పెట్టిన మానుషీ చిల్లర్

సాన్యా(చైనా): 2018 ప్రపంచ సుందరి కిరీటాన్ని మెక్సికోకు చెందిన యువతి దక్కించుకుంది. చైనాలోని సాన్యా ఎరెనాలో 68వ అందాల పోటీలను శని వారం నాడు అట్టహాసంగా నిర్వహించారు. ఈ పోటీలో మెక్సికోకు చోందిన ప్రముఖ మోడల్ అండ్ వాలంటీర్ వెనెస్సా పోన్స్ డి లియోన్ గెలుచుకున్నారు.

భారత అందాల సుందరి, 2017 మిస్ వరల్డ్ మానుషీ చిల్లర్ తన వారసురాలు డిలియోన్‌కు కిరీటాన్ని పెట్టి, అభినందనలు తెలిపారు. ఈ ఏడాది వివిధ దేశాల నుంచి 118 మంది సుందరీమణులు పోటీ పడ్డారు. కిరీటం వనెస్సాను వరించింది. భారత్ నుంచి అనుకీర్తి వ్యాస్ అందాలపోటీలకు వెళ్లారు.

Miss World 2018: Miss Mexico Venessa Ponce De Leon wins Miss World

మిస్ మెక్సికో వానెస్సా ప్రోన్స్ డి లియోన్ వయస్సు 26. ఇంటర్నేషనల్ బిజినెస్ డిగ్రీ చేశారు. మైంగ్రాంట్స్ ఎన్ ఎల్ కామినో, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఆఫ్ ఏ రిహాబ్ సెంటర్ ఫర్ గర్ల్స్ సంస్థల్లో వాలంటీర్‌గా ఉన్నారు.

68వ అందాల పోటీల ఫైనల్స్ వేడుకలు డ్యాన్స్ పోటీలతో ఉర్రూతలూగించాయి. అమెరికా స్టార్ డోనెల్ మంజేనా తన పాటలు, స్టెప్పులతో అలరించారు. వేదికపై మాజీ ప్రపంచ సుందరి మానుషీ ఛిల్లార్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. గత ఏడాది ఆమె అందాల కిరీటాన్ని దక్కించుకున్నారు. 2018 విజేత వనెస్సా ధరించిన గౌన్ అందరినీ ఆకట్టుకుంది. న్యాయనిర్ణేతలు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+