రైతును మింగేసిన 26 అడుగుల పాము: కత్తిరించి బయటకు తీస్తే ! (వీడియో)

Posted By:
Subscribe to Oneindia Telugu

జకర్తా: తోటలో పని చెయ్యడానికి వెళ్లిన రైతును 26 అడుగుల పొడవు ఉన్న కొండచిలువ (పైతాన్) మింగేసి పొట్టనపెట్టుకున్న సంఘటన ఇండోనేషియాలో జరిగింది. ఇండోనేషియాలోని సుల్వేసి ద్వీపంలో అక్బర్ సలుర్బీ (25) అనే యువకుడు కొండచిలువకు బలి అయ్యాడు.

షాక్: బాటిల్ నీళ్లు తాగేసిన కింగ్ కోబ్రా: కలికాలం అంటే ఇదే (వీడియో)

సెల్వేసి ద్వీపంలోని పండ్ల తోటలో అక్బర్ పని చెయ్యడానికి వెళ్లి మాయం అయ్యాడు. అక్బర్ తిరిగి ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు, బందువులు పండ్ల తోటలోకి వెళ్లి పరిశీలించారు. తోటలో కడుపు ఉబ్బిపోయి కదలలేని స్థితిలో కొడచిలువ దర్శనం ఇచ్చింది.

తోటలోకి వెళ్లిన అక్బర్ ను ఎమైనా కొండచిలువ మింగేసిందా అనే అనుమానం అతని కుటుంబ సభ్యులకు వచ్చింది. అంతే స్థానికులు పెద్ద కత్తి తీసుకుని కొండచిలువను నిలువునా చీల్చుకుంటూ వెళ్లారు. చివరికి కొండ చిలువ కడుపులో అక్బర్ శవమై కనిపించాడు.

కొండచిలువ శరీరంలోని నుంచి అక్బర్ మృతదేహాన్నిబయటకు తీశారు. అక్బర్ శరీరంలోని ఎముకలు నలిగిపోయాయని అతని కుటుంబ సభ్యులు స్థానిక మీడియాకు చెప్పారు. కొండచిలువ శరీరంలో నుంచి అక్బర్ మృతదేహాన్ని బయటకు తీసే సమయంలో వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో వైరల్ అయ్యింది.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Akbar, 25, had not been seen since setting off to harvest palm oil in a remote village on the island of Sulawesi.
Please Wait while comments are loading...