62 ఏళ్ల వయసులో 13వ బిడ్డకు జన్మ.. కానీ..!
తల్లి కావాలని పెళ్లయిన ప్రతి మహిళకూ ఉంటుంది. అయితే ఓ మహిళ 68 ఏళ్లకే 13మందికి జన్మనిచ్చింది. పిల్లలపై ఉన్న ప్రేమతో సరోగసీ ఆధారంగా 14వ బిడ్డకూ.. 15వ బిడ్డకూ తల్లి అయింది. కానీ చివరికి కటకటాల పాలు అయింది. ఈ ఘటన న్యూయార్క్ లో జరిగింది. అయితే ఆమె తన 14, 15 వ పిల్లలకోసం తన భర్తను అలాగే ఐవీఎఫ్ ఫెర్టిలిటీ సెంటర్ ను మోసం చేసింది. ఎట్టకేలకు దొరికిపోయింది.
న్యూయార్క్ కు చెందిన మేరీ బెత్ లెవిస్ వయసు 68 సంవత్సరాలు. ప్రస్తుతం ఆమె వార్తల్లో నిలిచారు. తన 62 ఏళ్ల వయసులో 13 వ బిడ్డకు జన్మనిచ్చిన ఆమె.. ఆ తర్వాత పిల్లలపై ప్రేమతో దారుణానికి ఒడిగట్టింది. సరోగసీ ఆధారంగా 14, 15వ బిడ్డలకు తల్లి అయింది. తన భర్త ఫోర్జెరీ సంతకం అలాగే ఐవీఎఫ్ ఫెర్టిలిటీ సెంటర్ కు నకిలీ డాక్యుమెంట్స్ సమర్పించింది. అలా అద్దె గర్భం ద్వారా 14, 15వ బిడ్డలకు తల్లి అయింది మేరీ బెత్ లెవిస్.

అయితే తనకు మరెంతోమంది పిల్లలు కావాలని ఆశపడింది. దీనికి ఆమె భర్త, పిల్లలు ఒప్పుకోలేదు. కానీ ఆమె మాత్రం తన భర్త సంతకాన్ని ఫోర్జెరీ చేయడమే కాకుండా.. నకిలీ డాక్యుమెంట్స్ ను సృష్టించి మరో ఇద్దరికి తల్లి అయింది. ఈ కేసులో ఆమె లీగల్ బ్యాటిల్ ఎదుర్కొంటున్న క్రమంలో చివరిగా పుట్టిన ఇద్దరు పిల్లల్ని అధికారులు పోస్టర్ కేర్ లో చేర్పించారు. ప్రస్తుతం మేరీ బెత్ లెవిస్ కస్టడీ కోరుకుంటోంది. పిల్లలపై తనకున్న ప్రేమతోనే అలా చేశానని.. అండాలు ధ్వంసం కాకుండా ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేసింది. ఓవైపు లీగల్ గా పోరాటం చేస్తూనే.. మరోవైపు తన పిల్లల్ని పోస్టర్ కేర్ నుంచి ఇంటికి తీసుకొచ్చేందుకు యత్నిస్తోంది.












Click it and Unblock the Notifications