వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మోస్ట్ వాంటెడ్: ఫేస్‌బుక్‌లో లైక్ కొట్టి అరెస్టయ్యాడు

|
Google Oneindia TeluguNews

న్యూయార్క్: అమెరికాలో మోంటనా ప్రాంతంలో విచిత్రమైన సంఘటన చోటుచేసుకుంది. దొంగతనం కేసులో నిందితుడైన ఓ వ్యక్తి ఫేస్‌బుక్‌ పేజీలో మోస్ట్‌ వాంటెడ్‌ క్రిమినల్‌గా పెట్టిన తన ఫొటోను తనే లైక్‌ కొట్టి దొరికిపోయాడు.

మోంటనా స్టేట్‌లోని క్యాస్‌కాడ్‌ కౌంటీ ఏర్పాటుచేసిన 'క్రైమ్స్‌టాపర్స్‌' ఫేస్‌బుక్‌ పేజీలో లెవి చార్లెస్‌ రేర్‌డాన్‌(23) అనే యువకుడు తన ఫొటోకు తనే లైక్‌ కొట్టుకున్నాడు. దీంతో ఫేస్‌బుక్‌లో మరికొంతమందికి అతడి ఫొటో చేరింది.

Facebook

ఆ పేజీలోనూ రేర్‌డాన్‌ ఫొటోను లైక్‌ చేసినట్లు చూపించింది. దీంతో పోలీసులు చాకచక్యంగా కూపీలాగి దర్యాప్తు చేసి అతడిని పట్టుకున్నారు.

కాగా, గత జనవరిలో జరిగిన వ్యాలెట్‌, చెక్‌బుక్కుల దొంగతనం, ఫోర్జరీ తదితర కేసుల్లో రేర్‌డాన్‌ నిందితుడుగా ఉన్నాడు. మొత్తానికి ఫొటోకు లైక్‌ కొట్టి బుక్కైపోయాడు దొంగ చార్లెస్. గత వారం అతడ్ని కోర్టు ముందు హాజరుపర్చారు. కాగా, కేసు విచారణ వచ్చే గురువారానికి వాయిదా పడింది.

English summary
A Montana man was arrested last month after he apparently "liked" his most wanted poster on a Crimestoppers Facebook page.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X