అందం: కూతురు కడుపులో ఏలికపాములు పెంచింది!

కలుషిత ఆహారం తీసుకోవడం వల్ల ఏర్పడ్డాయా? లేక ఆమె కావాలని వీటిని తినేసిందా అని వైద్యులు అనుమానించారు. అయితే అసలు నిజం వేరే ఉంది. బాధితురాలి తల్లి చెప్పిన సమాధానం విని మరోసారి వైద్యులు షాక్‌కు గురయ్యారు. తన కూతురు అందాల పోటీల్లో గెలుపొందాలని, అందుకోసం ఆమె సన్నగా ఉండాలనే ఉద్దేశంతో బాధితురాలి తల్లి ఆమెకు ఏలికపాములను తినిపించిందట. ఈ విషయాన్ని ఆమె స్వయంగా చెప్పింది.
దీంతో బాధితురాలి కడుపు మొత్తం ఆ ఏలికపాములతో నిండిపోయింది. ఈ నేపథ్యంలో ఆ యువతికి కడుపునొప్పి తీవ్ర కావడంతో ఆస్పత్రికి వచ్చింది. ఎమర్జెన్సీ గదికి తరలించిన వైద్యులు ఆమెకు చికిత్స చేశారు.
ఆమెకు మందులు వేసి టాయ్‌లెట్‌కు తీసుకెళితే అక్కడ మొత్తం ఏలికపాములే బయటకు వచ్చాయి. దీంతో ఆమె ఉపశమనం పొందింది.
బాధిత యువతికి చికిత్స అందించిన నర్సు మారికర్ కాబ్రాల్ ఓసోరియో ఓ టీవీ కార్యక్రమంలో మాట్లాడుతూ.. పై విషయాలన్ని వివరించింది. ఏలికపాములు చాలా పెద్దగా ఉన్నాయని, అవి టాయెలెట్ లోంచి కూడా బయటికి రావడానికి ప్రయత్నించాయని ఆ నర్సు తెలిపింది. బాధితురాలి తల్లి మెక్సికో నుంచి ఏలికపాముల గుడ్లు తీసుకొచ్చి, తన కూతురితో బలవంతంగా తినిపించినట్లు తేలింది. అయితే తాను చేసిన ఈ పనికి చింతిస్తున్నానని, బాధ కలిగించినందుకు తన కూతురుకు ఆ తల్లి క్షమాపణలు చెప్పడం కొసమెరుపు.












Click it and Unblock the Notifications