"నువ్వు ఉగ్రవాదివి, బంగ్లాదేశ్‌ను తగలబెట్టావు": యూనస్‌కు అమెరికాలో షాక్!

న్యూయార్క్‌లోని జాన్ ఎఫ్.కెన్నెడీ అంతర్జాతీయ విమానాశ్రయంలో బంగ్లాదేశ్ మాజీ తాత్కాలిక ప్రభుత్వాధిపతి మహమ్మద్ యూనస్‌కు ప్రవాస బంగ్లాదేశీయుల నుంచి తీవ్ర నిరసన ఎదురైంది. బంగ్లాదేశ్ ప్రధాన సలహాదారు పదవికి రాజీనామా చేసిన తర్వాత ఆయన చేసిన తొలి విదేశీ పర్యటనలోనే ఈ ఘటన చోటుచేసుకుంది. భద్రతా కారణాల దృష్ట్యా అధికారులు ఆయనను వెంటనే విమానాశ్రయం నుంచి సురక్షిత ప్రాంతానికి తరలించారు.

పులస చేపను ఛీ కొట్టిన దేశం! దిగుమతులు బ్యాన్
పులస చేపను ఛీ కొట్టిన దేశం! దిగుమతులు బ్యాన్

"నువ్వు బంగ్లాదేశ్‌ను తగలబెట్టావు" అంటూ నిరసనలు
ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఎయిర్పోర్టు బయట గుమిగూడిన నిరసనకారులు యూనస్ కు వ్యతిరేకంగా భారీ ఎత్తున నినాదాలు చేశారు. "నువ్వు ఒక ఉగ్రవాదివి. బంగ్లాదేశ్‌లో వేలాది మందిని, పోలీసులను చంపావు. ఇక్కడికి ఎందుకు వచ్చావు?" అని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. మహమ్మద్ యూనస్ చర్యల వల్ల దేశంలో ప్రజాస్వామ్యం నాశనమైందని, బంగ్లాదేశ్ అశాంతితో తగలబడిపోయిందని నిరసనకారులు ఆరోపించారు.

Muhammad Yunus Faces Protests at JFK Airport in America Protesters Slagans You Are a Terrorist

లోపలికి తిరిగి వెళ్లిన యూనస్.. భద్రతా సిబ్బంది చర్యలు
ఎయిర్పోర్టు బయట పరిస్థితి క్షణక్షణానికి ఉద్రిక్తంగా మారడాన్ని గమనించి.. యూనస్, ఆయన సహోద్యోగి లామియా మోర్షెడ్ వెంటనే ఎయిర్పోర్టు లోపలికి తిరిగి వెళ్లిపోయారని స్థానిక మీడియా పేర్కొంది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భద్రతా సిబ్బంది తక్షణమే స్పందించి వారిని అక్కడి నుంచి దూరంగా తీసుకువెళ్లారు. అయితే ఈ నిరసనలపై యూనస్ లేదా ఆయన ప్రతినిధులు ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన చేయలేదు.

IND vs WI 4th T20: హైదరాబాద్ వేదికగా నాలుగో టీ20.. భారత తుది జట్టు ఇదే!
IND vs WI 4th T20: హైదరాబాద్ వేదికగా నాలుగో టీ20.. భారత తుది జట్టు ఇదే!

భారత్‌తో క్షీణించిన సంబంధాలు
2024 ఆగస్టులో షేక్ హసీనా ప్రభుత్వం పడిపోయిన తర్వాత చెలరేగిన హింసాత్మక ఘటనలు, అశాంతిని యూనస్ ప్రభుత్వం సరిగ్గా నిర్వహించలేదని తీవ్ర విమర్శలు వచ్చాయి. ముఖ్యంగా ఆయన పదవీకాలంలో భారత్-బంగ్లాదేశ్ దౌత్య సంబంధాలు కూడా దెబ్బతిన్నాయి. 2025 మార్చిలో చైనా పర్యటన సందర్భంగా భారత ఈశాన్య రాష్ట్రాల గురించి యూనస్ చేసిన కామెంట్స్ ఇరు దేశాల మధ్య తీవ్ర వివాదానికి దారితీశాయి. తాజాగా న్యూయార్క్‌లో ఎదురైన ఈ తీవ్ర నిరసన ఆయన అంతర్జాతీయ ప్రతిష్టపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+