వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ 2017.. తొలిరోజు సంచలన ఆవిష్కరణలు

స్పెయిన్ లోని బార్సిలోనాలో మొబైల్ వరల్డ్ కాంగ్రెస్-2017 ప్రదర్శన ప్రారంభమైంది. నోకియా, ఎల్ జీ, శాంసంగ్ వంటి ప్రముఖ కంపెనీలు తమ తమ ఉత్పత్తులను విడుదల చేశాయి.

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

బార్సిలోనా: స్పెయిన్ లోని బార్సిలోనాలో మొబైల్ వరల్డ్ కాంగ్రెస్-2017 ప్రదర్శన ప్రారంభమైంది. నాలుగు రోజులపాటు జరగనున్న ఈ ప్రదర్శనలో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న టెక్, సాఫ్ట్ వేర్, ఎలక్ట్రానిక్ దిగ్గజ సంస్థలు పాల్గొంటున్నాయి.

నోకియా

నోకియా

ప్రదర్శనలో భాగంగా ఇప్పటికే నోకియా, ఎల్ జీ, శాంసంగ్ వంటి ప్రముఖ కంపెనీలు తమ తమ ఉత్పత్తులను విడుదల చేశాయి.

నోకియా నుంచి...

నోకియా నుంచి...

నోకియా 3310 ఫీచర్ ఫోన్ తోపాటు 3, 5, 6 స్మార్ట్ ఫోన్లను విడుదల చేసింది. ఈ ఫోన్లు వరుసగా, రూ.3500, రూ.9,780, రూ.13,000, రూ.16,117 ధరలకు వినియోగదారులకు లభ్యమవుతున్నాయి.

బ్లాక్ బెర్రీ కీ వన్, హువావే పీ10, పీ 10 ప్లస్

బ్లాక్ బెర్రీ కీ వన్, హువావే పీ10, పీ 10 ప్లస్

ఇక బ్లాక్ బెర్రీ కీ వన్ ఫోన్ ను, హువావే పీ10, పీ 10 ప్లస్ ఫోన్లను విడుదల చేశాయి. ఇవి వరుసగా రూ.36,590, రూ.45,675, రూ.49,195 ధరలకు లభ్యమవుతున్నాయి. హువావే సంస్థ ఈ ఫోన్లతోపాటు వాచ్ 2, వాచ్ 2 క్లాసిక్ పేరిట రెండు కొత్త ఆండ్రాయిడ్ వేర్ 2.0 స్మార్ట్ వాచ్ లను విడుదల చేసింది. ఇవి రూ.23000, రూ.28000 ధరలకు లభిస్తాయి.

హెచ్ పీ, మోటరోలా నుంచి...

హెచ్ పీ, మోటరోలా నుంచి...

హెచ్ పీ సంస్థ ప్రొ ఎక్స్2 612 జీ2 పేరిట ఓ నూతన ల్యాప్ టాప్ ను విడుదల చేసింది. ఇది రూ.65,238 ధరకు లభిస్తుంది. మోటోరోలా మోటో జీ5, జీ5 ప్లస్ ఫోన్లను విడుదల చేసింది. ఇవి రూ.14,005 మరియు రూ.15,260 ప్రారంభ ధరలకు లభిస్తాయి.

శాంసంగ్ నుంచి గెలాక్సీ ట్యాబ్ ఎస్3, ఇంకా...

శాంసంగ్ నుంచి గెలాక్సీ ట్యాబ్ ఎస్3, ఇంకా...

గెలాక్సీ ట్యాబ్ ఎస్3 పేరిట ఓ నూతన ఆండ్రాయిడ్ టాబ్లెట్ ను శాంసంగ్ కంపెనీ విడుదల చేసింది. ఈ టాబ్లెట్ ధర వివరాలను ఇంకా వెల్లడించలేదు. అలాగే ఓ నూతన గేర్ వీఆర్ హెడ్ సెట్ ను కూడా శాంసంగ్ విడుదల చేసింది. దీని ధర కూడా బయటికి రాలేదు.

గెలాక్సీ ఎస్8, ఎస్8 ప్లస్

గెలాక్సీ ఎస్8, ఎస్8 ప్లస్

వీటితోపాటు శాంసంగ్ ప్రతిష్ఠాత్మకంగా విడుదల చేయనున్న ఫ్లాగ్ షిప్ స్మార్ట్ ఫోన్లు గెలాక్సీ ఎస్8, ఎస్8 ప్లస్ ల విడుదల తేదీని కూడా ఈ కంపెనీ ప్రకటించింది. మార్చి 29వ తేదీన న్యూయార్క్ లో ఈ ఫోన్లను శాంసంగ్ విడుదల చేయనుంది.

ఎల్ జీ, లెనెవోల నుంచి..

ఎల్ జీ, లెనెవోల నుంచి..

ఇక ఎల్ జీ సంస్థ తన నూతన ఫ్లాగ్ షిప్ ఫోన్ జీ6ను విడుదల చేసింది కానీ ధర వివరాలను మాత్రం వెల్లడించలేదు. లెనెవో మిక్స్ 320 కన్వర్టబుల్ ల్యాప్ టాప్ ను విడుదల చేసింది. మిక్స్ 310 ల్యాప్ టాప్ కు కొనసాగిపే ఈ మోడల్. అయితే ఈ ల్యాప్ టాప్ ధర వివరాలను లెనెవో కూడా వెల్లడించలేదు.

యోగా 520 ల్యాప్ టాప్, సోనీ ఎక్స్ పీరియా ఎక్స్ఏ1

యోగా 520 ల్యాప్ టాప్, సోనీ ఎక్స్ పీరియా ఎక్స్ఏ1

వీటితోపాటు లెనెవో 13, 14 అంగుళాల వేరియంట్లలో యోగా 520 ల్యాప్ టాప్ ను కూడా విడుదల చేసింది. దీని ప్రారంభ ధర రూ.42,238. ఇక సోనీ సంస్థ ఎక్స్ పీరియా ఎక్స్ఏ1 అల్ట్రా ఫోన్ ను విడుదల చేసింది కానీ, ధర మాత్రం ప్రకటించలేదు.

మొబైల్ వరల్డ్ కాంగ్రెస్-2017 ప్రదర్శన మరో మూడు రోజులపాటు కొనసాగనున్న నేపథ్యంలో ఇంకా ఏమేం కంపెనీలు ఏయే కొత్త గ్యాడ్జెట్లను విడుదల చేస్తాయో.. భవిష్యత్తులో ఇంకెలాంటి సాంకేతిక పరిజ్ఞానం మన కళ్లను కట్టిపడేస్తుందో.. వేచి చూడాల్సిందే!

English summary
The latest edition of Mobile World Congress has been concluded in Spain, Barcelona and gave us a glimpse of what the biggest mobile makers has to offer to smartphone enthusiasts. The show was stocked full of high-end smartphones from the house of Samsung, LG, Motorola, Huawei, etc. and even introduced the most anticipated Nokia smartphones to the world.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X