గల్లంతైన సైనిక విమానం: అండమాన్ తీరానికి కొట్టుకొచ్చిన మృతదేహాలు, శకలాలు

116మంది ప్రయాణికులతో గురువారం గల్లంతైన మయన్మార్‌ సైనిక విమాన శకలాలు, ప్రయాణీకుల మృతదేహాలు అండమాన్ సముద్ర తీరానికి కొట్టుకొచ్చినట్లు ఆర్మీ అధికారులు ధ్రువీకరించారు.

యంగూన్: 116మంది ప్రయాణికులతో గురువారం గల్లంతైన మయన్మార్‌ సైనిక విమాన శకలాలు, ప్రయాణీకుల మృతదేహాలు అండమాన్ సముద్ర తీరానికి కొట్టుకొచ్చినట్లు ఆర్మీ అధికారులు ధ్రువీకరించారు. గురువారం ఉదయం 8.25గంటల సమయంలో అండమాన్‌ సముద్ర తీరంలో అలలకు మూడు మృతదేహాలు కొట్టుకు వచ్చాయి.

మృతుల్లో ఒక మహిళ, చిన్నారి కూడా ఉన్నారు. అంతేగాక ఆ విమాన ప్రయాణికుల లగేజీ, సేఫ్టీ జాకెట్లు, ఎయిర్‌క్రాఫ్ట్‌ చక్రం ఒకటి లభ్యమయ్యాయి. మిగతా వారి మృతదేహాల కోసం నావికా దళ అధికారులు పడవల ద్వారా గాలింపు చర్యలు చేపట్టినట్లు సైనిక సమాచార బృందం ప్రతినిధి ఒకరు మీడియాకు తెలిపారు.

plane

మయన్మార్‌లోని లాంగ్లాన్‌ తీర ప్రాంతంలో విమాన శకలాన్ని గుర్తించినట్లు ఆర్మీ చీఫ్‌ ఆఫీస్‌ కమాండర్‌ తెలిపారు. బుధవారం మధ్యాహ్నం సైనిక విమానం గల్లంతైన విషయం తెలిసిందే.

ఈ విమానంలో ఎక్కువ మంది సైనిక సిబ్బంది కుటుంబసభ్యులే ఉన్నారు. వారిలో 15 మంది చిన్నారులు, 35 మంది సైనికులు, 14 మంది విమాన సిబ్బంది ఉన్నట్లు మయన్మార్ ఆర్మీ చీఫ్‌ కార్యాలయం వెల్లడించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+