నాసా బంపర్ ఆఫర్.. పడుకుంటే 11 లక్షలు చెల్లిస్తుందట

కదలకుండా జస్ట్ పడుకోవాలంతే... మీకు 11 లక్షలు వచ్చి చేరుతాయి. ఇదేంటి పడుకుంటేనే 11 లక్షలు ఇస్తారా... ఇంతటి ఆఫర్ ఎవరిస్తున్నారనేగా మీ డౌటు... అవునండీ ఇది నిజం. నాసా చేస్తున్న సరికొత్త ప్రయోగం కోసం ఈ భారీ ఆఫర్ ప్రకటించింది. ఇందుకోసం రిక్రూట్‌మెంట్ కూడా ప్రారంభించింది. ఏ కిటుకు లేకుండా ఉత్త పుణ్యానికి అంత భారీ మొత్తం చెల్లించేందుకు అది మామూలు కంపెనీ కాదు... అంతరిక్ష పరిశోధనలు చేసే నాసా సంస్థ. పడుకోవడమంటే ఒకరోజు రెండు రోజులు కాదు 70 రోజులు పడుకోవాలి. ఏంటి చిన్న సైజు బిగ్‌బాస్ షో గుర్తుకొస్తోందా.. మరి అంత డబ్బు ఇస్తున్నప్పుడు ఈ కొంచెం పని చేయక తప్పదు.

ఒక మనిషి అంతరిక్షంలో ఉంటే తన బరువుపై ప్రయోగం చేసేందుకు నాసా పూనుకుంది. ఇందుకోసం ఒక సెటప్ ఏర్పాటు చేసింది. బెడ్‌రెస్ట్ స్టడీ పేరుతో ఇప్పటికే అభ్యర్థులను నాసా నియమించుకుంటోంది. ఇక ఇక్కడ జాబ్ ఏమిటంటే నిద్రపోవడమే.. అంటే పడుకొనే తినాలి, పడుకొనే స్నానాలు చేయాలి... అప్పుడు మానవుని గుండె రక్తనాళాల వ్యవస్థ ఎలాగుంటుందో పరీక్షిస్తారు. దీని ద్వారా అంతరిక్షంలో మానవుని ఆరోగ్య పరిస్థితిని అంచనా వేస్తారు శాస్త్రవేత్తలు.

Nasa offers 11 lakhs for sleeping..here is the reason

ఇలాంటి ఆఫరే 2013లో నెదర్లాండ్స్ రాజధాని హెల్సిన్కీ‌లో హోటల్ ఫిన్ యాజమాన్యం ఇదే తరహా పరీక్షల కోసం మనుషులను నియమించుకుంది. తమ హోటల్‌లోని బెడ్లను పరీక్షించి తద్వారా తమ కస్టమర్లు తమ నుంచి ఎలాంటి కంఫర్ట్ కోరుతున్నారో అంచనావేశారు. పడుకున్న వారికి భారీగానే డబ్బులు చెల్లించింది యాజమాన్యం. ఇప్పుడు చెప్పండి హాయిగా నిద్రపోయే ఉద్యోగం ఇచ్చి జీతం ఇస్తామంటే ఎవరైతే అప్లై చేసుకోరు చెప్పండి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+