వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇమ్రాన్ ఖాన్ కు పాక్ ఆర్మీ డెడ్ లైన్- 20లోగా రాజీనామా-నవాజ్ షరీఫ్ రీ ఎంట్రీ-ప్రధానిగా షాబాజ్

|
Google Oneindia TeluguNews

పాత తెలుగు సినిమాల్లో ఓ డైలాగ్ ఉంటుంది. నీ జీవితం మీద నాకు విరక్తి కలిగింది అని ప్రత్యర్ధిని ఉద్దేశించి విలన్ చెబుతాడు. అంటే సదరు ప్రత్యర్ధికి టైమ్ దగ్గర పడిందని అర్ధం. ఇఫ్పుడు అదే తరహాలో పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పై అక్కడి సైన్యానికి విరక్తి కలుగుతోంది. ఫలితంగా ఒకప్పుడు తాము తన్ని తరిమేసిన మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ ను తిరిగి తెచ్చుకునేందుకు సైన్యం పావులు కదుపుతోంది. దీంతో సైన్యం అండగా పాకిస్తాన్ లో రీ ఎంట్రీ ఇచ్చేందుకు నవాజ్ ఏర్పాట్లు చేసుకుంటున్నారు.

పాకిస్తాన్ లో మారిన సీన్

పాకిస్తాన్ లో మారిన సీన్

దశాబ్దాల క్రితమే స్వాతంత్రం పొంది ప్రజాస్వామ్య దేశంగా చెప్పుకునే పాకిస్తాన్ లో ఇప్పటికీ సైన్యం కన్నుసన్నల్లోనే పాలన సాగించాల్సిన దుస్ధితి ప్రభుత్వాలది. పేరుకు ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలే అయినా వాటికి కంటికి రెప్పలా కాపలా కాసేది మాత్రం సైన్యమే. అలాంటి సైన్యాన్ని ధిక్కరించే పాలన సాగించేందుకు ప్రభుత్వాలు గత కొన్నేళ్లుగా తీవ్ర ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాయి. అయినా సాధ్యం కావడం లేదు. సైన్యాన్ని మెప్పించిన వారే పాలకులుగా ఉండటం, వారి ఆగ్రహానికి గురైన వారు దేశం విడిచి ప్రవాసానికి వెళ్లిపోవడం అక్కడ సర్వసాధారణమే. గతంలో ఇదే కోవలో నవాజ్ షరీఫ్, బేనజీర్ భుట్టో పంటి ప్రధానులే ప్రవాసానికి వెళ్లిపోయారు.

ఇమ్రాన్ తప్పుకునేందుకు ఆర్మీ డెడ్ లైన్

ఇమ్రాన్ తప్పుకునేందుకు ఆర్మీ డెడ్ లైన్

ప్రస్తుతం పాకిస్తాన్ తీవ్ర ఆర్ధిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. మరోవైపు తీవ్రవాద దాడులతో సతమతం అవుతోంది. ఎన్నో ఆశలతో గద్దెనెక్కించిన ఇమ్రాన్ ఖాన్ పై విపక్షాల పోరు పెరుగుతోంది. అదే్ సమయంలో ఇమ్రాన్ ఖాన్ సమర్ధతపై నమ్మకం సడలిపోతోంది. విదేశాలతో అయినా సఖ్యత ఉందా అంటే అదీ లేదు. దీంతో ఇమ్రాన్ ఖాన్ పై ఆర్మీకి విరక్తి మొదలైంది. అదే సమయంలో ఐఎస్ఐ ఛీఫ్ ను మార్చడం, దేశంలో ఆందోళనలు, మరికొన్ని కారణాలతో ఇమ్రాన్ ఖాన్ పై ఆర్మీకి విశ్వాసం సన్నగిల్లింది. దీంతో ఇమ్రాన్ రాజీనామాకు ఆర్మీ డెడ్ లైన్ పెట్టినట్లు తెలుస్తోంది. నవంబర్ 20లోగా ఇమ్రాన్ తన పదవిని వదులుకునేందుకు గడువు విధించింది. రాజీనామా లేదా అధికార మార్పిడి ఆప్షన్లు ఇచ్చినట్లు తెలుస్తోంది.

 నవాజ్ షరీఫ్ రీ ఎంట్రీకి సన్నాహాలు

నవాజ్ షరీఫ్ రీ ఎంట్రీకి సన్నాహాలు

ఇదే అదనుగా తిరిగి పాకిస్తాన్ రాజకీయాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చేందుకు నవాజ్ షరీఫ్ ప్రయత్నాలు ప్రారంభించారు. గతంలో రెండు అవినీతి కేసుల్లో శిక్షపడిన నవాజ్ షరీఫ్ వైద్యం చేయించుకునేందుకు కోర్టు అనుమతితో లండన్ వెళ్లారు. నాలుగు వారాల అనుమతి ముగియడంతో తిరిగి రీ ఎంట్రీ ఇచ్చేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. అయితే పాకిస్తాన్ లో నెలకొన్న పరిస్ధితులతో ఆర్మీ సాయం లేనిదే ఆయన ఎంట్రీ ఇచ్చేందుకు కూడా వీల్లేదు. దీంతో ఆర్మీతో టచ్ లో ఉంటూ తిరిగి పాకిస్తాన్ వచ్చేందుకు ఆయన సన్నాహాలు చేసుకుంటున్నారు.

 పాకిస్తాన్ కొత్త ప్రధానిగా షాబాజ్ షరీఫ్?

పాకిస్తాన్ కొత్త ప్రధానిగా షాబాజ్ షరీఫ్?

పాకిస్తాన్ లో నవంబర్ 20లోగా ప్రధాని ఇమ్రాన్ ఖాన్ రాజీనామా చేస్తే ఆయన స్ధానంలో కొత్త ప్రధానిగా ఇద్దరి పేర్లను ఆర్మీ పరిశీలిస్తోంది. ఇందులో నవాజ్ షరీఫ్ పార్టీ పాకిస్తాన్ ముస్లిం లీగ్ (నవాజ్) కు చెందిన ఆయన సోదరుడు షాబాజ్ షరీఫ్ ను ప్రధానిగా ఎంపిక చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.

కుదరకపోతే మాత్రం ఇమ్రాన్ ఖాన్ పార్టీ పాకిస్తాన్ తెహ్రీక్ ఈ ఇన్సాఫ్ (పీటీఐ)కి చెందిన పర్వేజ్ ఖట్టాక్ ను ప్రధానిగా ఎంపిక చేయనున్నారు. వీరిద్దరిలో ఒకరు ప్రధాని కావడం ఖాయం. ఇందుకోసం ముందుగా పాకిస్తాన్ ప్రస్తుత ప్రభుత్వానికి మద్దతిస్తున్న ముత్తాహిదా క్వామీ మూవ్మెంట్ (ఎంక్యూఎం), పాకిస్తాన్ ముస్లిం లీగ్ (పీఎంఎల్-క్యూ) ఇమ్రాన్ ఖాన్ సర్కార్ కు మద్దతు ఉపసంహరించుకోనున్నట్లు తెలుస్తోంది.

English summary
former pakistan prime minister nawaz sharif may return to his home land after a long gap amid tussle between pm imran khan and army.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X