వైరల్ వీడియో: ఆర్థిక మంత్రిని పరిగెత్తించి పొట్టు పొట్టు కొట్టారు
భారత్ సరిహద్దు దేశం నేపాల్ అట్టుడికిపోతోంది. నేపాల్ లో సోషల్ మీడియా నిషేధంపై దేశ ప్రజలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా గర్జించారు. ప్రభుత్వం నిర్ణయాన్ని నిరసిస్తూ నిరసనకారులు చేపట్టిన ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. దేశవ్యాప్తంగా ఆందోళనలు చెలరేగాయి. పోలీసుల దాడిలో 12 ఏళ్ల బాలుడితోపాటు 19 మంది ప్రాణాలు కోల్పోయారు. 347 మందికి గాయాలు అయ్యాయి. నేపాల్ రాజధాని ఖాట్మండు సహా పలు ప్రధాన నగరాల్లో కర్ఫ్యూ విధించింది ప్రభుత్వం.
#WATCH NEPAL GEN-Z PROTESTS DAY 2| Finance Minister Bishnu Prasad Paudel Beaten Up By Protesters.#nepalprotest #protest #genz #genzprotest #kathmandu #KathmanduProtest #SocialMediaBan #nepalnewsupdate #nepalnewstoday #nepalnews #NepalBreakingNews #nepalupdate #nepal pic.twitter.com/d4ov0leuWW
— Northeast Live (@NELiveTV) September 9, 2025
పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ఎక్కడికక్కడ సైన్యాన్ని మోహరించింది. ఈ ఆందోళనల్లో యువత అధికంగా పాల్గొంటున్నారు. మరోవైపు నేపాల్ లో ఉన్న భారతీయులు జాగ్రత్తగా ఉండాలని కేంద్ర ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. స్థానిక అధికార యంత్రాంగం జారీ చేసే మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలని ఆదేశించింది.
నేపాల్ లో పరిస్థితి దారుణంగా మారింది. నిరసనలు హింసాత్మకంగా మారాయి. రాజధాని ఖాట్మండు సహా అనేక ప్రాంతాల్లో నిరసనకారులు విధ్వంసం సృష్టిస్తున్నారు. ఈ నిరసనల నేపథ్యంలో నేపాల్ ప్రధాన మంత్రి కే.పీ. శర్మ ఓలి తన పదవికి రాజీనామా చేశారు. వారితోపాటు హోం మంత్రి రమేష్ లేఖక్, వ్యవసాయ శాఖ మంత్రి రామ్ నాథ్ అధికారి, ఆరోగ్య శాఖ మంత్రి సహా ఐదుగురు మంత్రులు రాజీనామా చేశారు.

ఈ క్రమంలో నేపాల్ ఆర్థిక మంత్రి బిష్ణు ప్రసాద్ పౌడెల్ పై నిరసనకారులు దాడి చేశారు. అతడ్ని కిందపడేసి కాళ్లతో తన్నుతూ దాడి చేశారు. అందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. నిరసనకారులు ఆర్థికమంత్రిని పరుగెత్తించారు. ఈ దాడిలో ఆయనకు తీవ్ర గాయాలైనట్లు సమాచారం.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications