ఇజ్రాయెల్ పీఎంతో ప్రధాని మోదీ ఫోన్ కాల్.. కీలక హామీ..!

భారత ప్రధాని నరేంద్ర మోదీకి ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఫోన్ చేశారు. ఇరు దేశాల మధ్య సత్సంబంధాలపై నేతలు చర్చించుకున్నారు. భారత్- ఇజ్రాయెల్ మధ్య వ్యూహాత్మక బంధాలు మరింత బలోపేతం దిశగా నిర్ణయాలు తీసుకోవాలని చర్చించారు. ఈ మేరకు పశ్చిమాసియాలోని పరిస్థితులను ప్రధాని మోదీకి.. నెతన్యూహు వివరించారు. ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపేందుకు వెనకడుగు వేసేది లేదని ఇరు దేశాల నేతలు నిర్ణయానికి వచ్చారు.

ప్రధాని నరేంద్రమోదీతో ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఫోన్ లో సంభాషించారు. ఈ సంభాషణ డిసెంబర్ 10, బుధవారం రోజున జరిగింది. ఇరు దేశాల మధ్య సత్సంబంధాలను మరింత బలోపేతం చేయడంపై చర్చలు జరిపారు. ఉగ్రవాదాన్ని ఏరిపారేయడంపై ఇరు దేశాలు కృత నిశ్చయంతో ఉన్నట్లు తెలిపారు. టెర్రరిజం ఏ దశలో ఉన్నా సమర్థవంతంగా నిర్మూలించేందుకు ఇరు దేశాలు కట్టుబడి ఉన్నట్లు నిర్ణయానికి వచ్చారు. ఇరు దేశాల ఆర్థికాభివృద్ధికి దోహదపడే విధంగా నిర్ణయాలు, ఒప్పందాలు జరగాలని అంగీకారానికి వచ్చారు.

ఈ క్రమంలో పశ్చిమాసియాలోని పరిస్థితులను ప్రధాని మోదీకి.. నెతన్యాహు వివరించారు. ఈ మేరకు ఇజ్రాయెల్ కు భారత్ ఫుల్ సపోర్ట్ ఉంటుందని ప్రధాని మోదీ హామీ ఇచ్చారు. గాజా శాంతి ప్రణాళికను త్వరగా అమలు చేయడంతో పాటుగా ఆ ప్రాంతంలో శాశ్వత శాంతిని నెలకొల్పేందుకు జరిపే ప్రయత్నాలకు భారత్ మద్దతును ప్రధాని మోదీ మరోసారి నొక్కి చెప్పారు. ఈ మేరకు ఇరు దేశాధినేతలకు ఫోన్ సంభాషణ వివరాలను ప్రధాని కార్యాలయం(PMO) ఓ ప్రకటనలో తెలిపింది.

Netanyahu Calls PM Modi India-Israel Friendship Gets Stronger

మరోవైపు డిసెంబర్‌ నెలలో ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు భారత్ లో పర్యటించాల్సి ఉంది. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల పర్యటన వాయిదా పడింది. త్వరలోనే కొత్త తేదీని ఖరారు చేసేందుకు ఇజ్రాయెల్ అధికారులు భారత అధికారులతో సమన్వయం చేసుకుంటున్నట్లు నెతన్యాహు కార్యాలయం తాజాగా స్పష్టం చేసింది. పర్యటన వాయిదా పడినా.. ఇజ్రాయెల్- భారత్‌ మధ్య సత్సంబంధాలు కొనసాగుతున్నాయని ఇజ్రాయెల్ ప్రధాని కార్యాలయం పేర్కొంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+