H-1B Visa లపై బిగ్ యూటర్న్- వారి అప్లికేషన్లు బ్లాక్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అమలులోకి తీసుకొచ్చిన H-1B వీసా ప్రోగ్రామ్‌కు భారీ షాక్ తగలింది. దీనిపై టెక్సాస్ విస్తృతమైన ఆంక్షలను విధించింది. ఈ మేరకు ఆ రాష్ట్ర గవర్నర్ గ్రెగ్ అబాట్ ఉత్తర్వులు జారీ చేశారు. కొత్త హెచ్ 1బీ వీసా దరఖాస్తులను తక్షణమే నిలిపివేశారు. ప్రభుత్వ నిధులు, ఉద్యోగాలను అమెరికన్ వర్కర్లు, ప్రొఫెషనల్స్ కు కేటాయించాలని ఆదేశించారు. అన్ని ప్రభుత్వ ఏజెన్సీలు, విశ్వవిద్యాలయాలను ఈ ఉత్తర్వుల పరిధిలోకి తీసుకొచ్చారు.
గ్రెగ్ అబాట్ రిపబ్లికన్ గవర్నర్ కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ నిలిపివేత- 2027 మే 31 వరకు అమలులో ఉంటుంది. ఈ నిర్ణయంతో హెచ్1బీ వీసా కార్యక్రమంపై ఇలాంటి ఆంక్షలను విధించిన మొదటి అమెరికన్ స్టేట్ గా నిలిచింది టెక్సాస్ నిలిచింది. ఫెడరల్ H1B వీసా ప్రోగ్రామ్ దుర్వినియోగమౌతోందంటూ వచ్చిన నివేదికలు, అమెరికన్ ఉద్యోగాలు స్థానికులకు మాత్రమే లభ్యమయ్యేలా చూసేందుకు ఫెడరల్ ప్రభుత్వం ఆ ప్రోగ్రామ్‌ను సమీక్షిస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అబాట్ తెలిపారు. కొత్త H1-B వీసా దరఖాస్తులను తక్షణమే నిలిపివేయాలని రాష్ట్రంలోని అన్ని ఏజెన్సీలను ఆదేశిస్తున్నట్లు చెప్పారు.

హెచ్ 1బీ వీసా కార్యక్రమం కింద ప్రత్యేక నైపుణ్యాలు అవసరం అయ్యే ఉద్యోగాల కోసం విదేశీ నిపుణులను నియమించుకోవడానికి ఆయా సంస్థల యజమానులకు అనుమతిస్తుంది. బ్యాచిలర్ డిగ్రీ అవసరం అయ్యే ఈ వీసాలు సంవత్సరానికి 65,000 వరకు అందుబాటులో ఉంటాయి. ఉన్నత విద్య అభ్యసించిన వారికి అదనంగా 20,000 వరకు కేటాయిస్తారు. ఇవి మూడు నుండి ఆరు సంవత్సరాల కాలానికి ఆమోదిస్తారు.
టెక్సాస్‌లోని ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు, ఆసుపత్రులు/వైద్య కేంద్రాలు, పాఠశాలలకు ఈ వీసాలు కీలక వనరుగా మారాయి. ఆయా రంగాల్లో ప్రతిభ కొరత ఏర్పడినప్పుడు ఇతర దేశాలకు చెందిన ప్రొఫెసర్లు, పరిశోధనా నిపుణులు, డాక్టర్లు, ఉపాధ్యాయులను నియమించుకోవడానికి ఇది వెసలుబాటు కల్పిస్తుంది. తాజా నిర్ణయాలను తీసుకోవడానికి గల కారణాలను టెక్సాస్ గవర్నర్ ఈ ఉత్తర్వు్లో వివరించారు.
ఈ వీసా ప్రోగ్రామ్ దుర్వినియోగమౌతోందని అర్హత కలిగిన స్థానిక కార్మికులు/నిపుణులు ఇక్కడే అందుబాటులో ఉన్నప్పటికీ.. వారిని నియమించుకోవడానికి ప్రాధాన్యత ఇవ్వట్లేదని, కృత్రిమ కొరతను సృష్టించి, విదేశీయులను నియమించుకుంటోన్నాయని, వీటిని రెగ్యులరైజ్డ్ చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. కొన్ని చోట్ల అమెరికన్ నిపుణులను తీసివేసి, తక్కువ జీతాలకే H-1B ఉద్యోగులను నియమించినట్లు రిపోర్టులు అందాయని పేర్కొన్నారు.
-
ఖమేనీ సంధి ఒప్పందం? -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్..












Click it and Unblock the Notifications