వీసా బాండ్ రాసిస్తేనే అమెరికాలో ఎంట్రీ

తమ దేశానికి రావడానికి వీసా బాండ్‌ను సమర్పించాల్సిన దేశాల కొత్త జాబితాను అమెరికా విడుదల చేసింది. ఇందులో మరో మూడు దేశాలను చేర్చింది. కొత్త వీసా బాండ్ పైలట్ కార్యక్రమాన్ని ప్రకటించింది. సంవత్సర కాలం పాటు అమలులో ఉండబోతోన్న ఈ వీసా బాండ్ పైలట్ ప్రోగ్రామ్ ఈ ఏడాది ఆగస్టు 20వ తేదీన అమలులోకి వచ్చింది. 2026 ఆగస్టు 5వ తేదీ వరకు కొనసాగుతుంది.

ఇది తాత్కాలిక సందర్శకులుగా అమెరికా వీసాల కోసం దరఖాస్తు చేసుకునే విదేశీయులు, అధిక వీసా ఓవర్‌స్టే రేట్లు ఉన్న దేశాల పౌరులు లేదా విదేశీయులకు పెట్టుబడి ద్వారా పౌరసత్వ ప్రణాళికలను అందించే దేశాలకు వర్తిస్తుంది. వీసా ఆమోదం పొందడానికి ముందు ఆయా దేశాల పౌరులు/సందర్శకులు 15, 000 డాలర్ల వరకు విలువ చేసే బాండ్ చెల్లించాల్సి ఉంటుంది. దీన్ని కాన్సులేట్ అధికారులు ధృవీకరించిన తర్వాతే చెల్లుబాటు అవుతుంది.

New Visa Bond Requirements for Select Countries Entering the U S

తాత్కాలిక సందర్శకులుగా వీసా కోసం దరఖాస్తు చేసుకునే విదేశీయులకు ఇది వర్తిస్తుంది. వీరికి B-1/B-2 కింద విసాలు మంజూరు అవుతాయి. హై- ఓవర్‌స్టే రేట్ ఉన్న దేశాల పౌరుల కోసం అమెరికా ఈ కొత్త వీసా బాండ్ పైలట్ ప్రోగ్రామ్‌ను ఈ ఏడాది ఆగస్టు 20వ తేదీన ప్రారంభించింది. గాంబియా, మలావి, జాంబియా దేశాలను తాజాగా దీని పరిధిలోకి తీసుకొచ్చింది. ఆయా దేశాల పౌరులు అమెరికాలోకి ప్రవేశించడానికి గరిష్టంగా 15,000 డాలర్ల వరకు విసా బాండ్ మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది.

ఈ పైలట్ ప్రోగ్రామ్ కింద బాండ్ పోస్ట్ చేసిన ప్రతి వీసా హోల్డర్ కూడా.. అమెరికా చట్టం ప్రకారం బోస్టన్ లోగాన్, జాన్ ఎఫ్ కెన్నెడీ, వాషింగ్టన్ డల్లెస్ అంతర్జాతీయ విమానాశ్రయాల ద్వారా మాత్రమే అమెరికాలోకి ప్రవేశించాలి. అక్కడి నుంచే తిరిగి వెళ్లాలి. దరఖాస్తుదారు తన నాన్-ఇమ్మిగ్రెంట్ వీసా స్థితి, బాండ్ లో పొందుపరిచిన అన్ని నిబంధనలను పాటించినట్లయితేనే ఆ 15,000 డాలర్ల మొత్తాన్ని తిరిగి తీసుకోగలుగుతారు. ఏ ఒక్కటి ఉల్లంఘించినా కూడా బాండ్ రద్దవుతుంది.

హై- ఓవర్‌స్టే రేట్ ఉన్న దేశాల జాబితాలో భారత్ లేదు. 2023లో భారత్ నుండి 3,822 మంది ఓవర్‌ స్టే అయ్యారు, దీని ఫలితంగా మొత్తం ఓవర్‌ స్టే రేటు 1.58 శాతంగా రికార్డయింది. B1/B2 వీసాలకు ఓవర్‌స్టే రేటు 1.29 శాతం. మలావి ఓవర్ స్టే రేటు 4.17 ఉంటోంది. జాంబియా- 10 శాతానికి పైగా, గాంబియా- 18.6 శాతానికి పైగా ఓవర్ స్టే రేటు నమోదైంది. ఈ మూడు దేశాల పౌరులు తాత్కాలికంగా అమెరికా వెళ్లడానికి 15,000 డాలర్ల విసా బాండ్ ను సమర్పించాల్సి ఉంటుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+