Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

న్యూయార్క్ అతలాకుతలం- ఎమర్జెన్సీ విధింపు

వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికా ఆర్థిక రాజధాని న్యూయార్క్ (New York) అతలాకుతలమౌతోంది. అల్లకల్లోలానికి గురవుతోంది. ఈ పరిణామాలను దృష్టిలో ఉంచుకుని నగరం మొత్తం మీద న్యూయార్క్‌లో ఎమర్జెన్సీ (New York emergency)ని విధించారు. అత్యవసర పరిస్థితులు ఉంటే తప్ప ఇళ్లల్లో నుంచి బయటికి రావొద్దంటూ హెచ్చరికలు జారీ చేశారు.

న్యూయార్క్‌లో కురిసిన భారీ వర్షానికి ఆకస్మిక వరదలు (New York flash floods) సంభవించడమే దీనికి కారణం. అమెరికా కాలమానం ప్రకారం శుక్రవారం తెల్లవారు జాము నుంచి కొన్ని గంటల పాటు ఏకధాటిగా వర్షం కురిసింది న్యూయార్క్‌లో. కొన్ని ప్రాంతాల్లో గరిష్ఠంగా 5.08 సెంటీమీటర్ల మేర వర్షపాతం నమోదైనట్లు అమెరికా వెదర్ సర్వీస్ తెలిపింది.

New York floods: declared a state of emergency after flash floods in the city

ఫలితంగా- అనేక ప్రాంతాలు జలమయం అయ్యాయి. రోడ్లపై వరద నీరు నిలిచింది. మోకాలి లోతుకు పైగా వర్షపు నీరు నిలిచిపోయింది. సబ్‌బేలన్నీ వరద నీటితో నిండిపోయాయి. చెరువులను తలపించాయి. ఇంకొన్ని గంటల పాటు ఇదే పరిస్థితి కొనసాగుతుందని, భారీ వర్షం కొనసాగుతుందని వెదర్ సర్వీస్ పేర్కొంది.

బ్రూక్లిన్, లోయర్ మన్‌హట్టన్, జాన్ ఎఫ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్, బారో ఆఫ్ క్వీన్స్, కాలేజ్ పార్క్, అవుటర్ మేరీలాండ్, లాంగ్ ఐస్‌లాండ్, హడ్సన్ వ్యాలీ.. ఇలా అనేక ప్రాంతాల్లో సుమారు ఆరు సెంటీ మీటర్ల మేర వర్షపాతం నమోదైంది. ఆయా ప్రాంతాల్లో ప్రజా రవాణా స్తంభించిపోయింది. రోడ్లపై వరద నీరు పోటెత్తడంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి.

ఈ పరిస్థితులపై న్యూయార్క్ గవర్నర్ క్యాథీ హాచుల్ సమీక్ష నిర్వహించారు. న్యూయార్క్ సిటీ మొత్తం మీద అత్యయిక పరిస్థితిని విధించినట్లు వెల్లడించారు. ప్రజలు ఎవరూ బయటికి రావొద్దని సూచించారు. వరద నీటితో పోటెత్తిన ప్రాంతాల్లో రాకపోకలు సాగించవద్దని విజ్ఞప్తి చేశారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+