స్టన్నింగ్ ఫైర్ వర్క్స్: కొత్త ఏడాదికి గ్రాండ్ వెల్‌కమ్ పలికి తొలి దేశం..!!

Happy New Year 2025: ఇంకొన్ని గంటల్లో ఈ ప్రపంచం నూతన సంవత్సరంలోకి అడుగు పెట్టబోతోంది. ఎన్నో కొత్త ఆశలతో 2025 రాబోతోంది. కొత్త ఏడాదిని స్వాగతం పలకడానికి భారత్ సహా అన్ని దేశాలు సంసిద్ధం అయ్యాయి. ఒక్కో దేశం ఒక్కో విధంగా కొత్త ఏడాదిలో ఎంట్రీ ఇవ్వబోతోంది.

పసిఫిక్ మహా సముద్ర ప్రాంత దేశాలు అన్నింటి కంటే ముందుగా కొత్త సంవత్సరం వేడుకలను జరుపుకొంటాయి. సూర్యుడి చుట్టూ భూమి పరిభ్రమించే క్రమంలో- ఆ భానుడి లేలేత కిరణాలు తొలిసారిగా ఆ దేశాల మీదే ప్రసరిస్తుండటమే దీనికి కారణం. తొలి పొద్దు పొడిచేది పసిఫిక్ మహా సముద్ర తీర ప్రాంత దేశాల్లోనే. ఆ తరువాతే ప్రపంచం నిద్ర లేస్తుంటుంది.

New Zealand welcomed New Year 2025 with stunning fireworks

పసిఫిక్ మహా సముద్రంలోని చిన్న ద్వీప దేశం.. కిరిబాతి. ఇక్కడి జనాభా 1.34 లక్షలు. ఓ అసెంబ్లీ నియోజకవర్గం కంటే తక్కువ జనాభా ఉండే దేశం ఇది. కొత్త సంవత్సరం మొట్టమొదటిసారిగా అడుగుపెట్టేది ఈ దేశంలోనే. కిరిబాతిలో అర్ధరాత్రి 12 గంటలైతే.. భారత్‌లో మధ్యాహ్నం 3:30 అవుతుంది. కిరిబాతి, టోంగా దీవుల్లోనూ ఒకేసారి కొత్త సంవత్సరం వేడుకలు జరుపుకొంటారు.

కొత్త సంవత్సరాన్ని తొలిసారిగా జరుపుకొనే పెద్ద దేశాలు న్యూజిలాండ్, ఆస్ట్రేలియా. ఆ క్రమంలో కొత్త ఏడాదికి న్యూజిలాండ్ గ్రాండ్‌గా వెల్‌కమ్ పలికింది. న్యూజిలాండర్లు కేరింతలతో 2025కు స్వాగతం పలికారు. ప్రధాన నగరాలన్నీ కూడా ఫైర్ క్రాకర్స్‌ మోతలతో మార్మోగిపోయాయి.

అక్లాండ్‌లోని ఐకనిక్ స్కై టవర్ మీద ఏర్పాటు చేసిన బాణాసంచా అద్దిరిపోయింది. అర్ధరాత్రి కావడానికి గంట ముందే అక్లాండ్ నగరవాసులు స్కైటవర్‌కు వద్దకు చేరుకున్నారు. కొత్త సంవత్సరానికి కౌంట్ డౌన్ ఆరంభించారు. సరిగ్గా క్లాక్ 12 గంటలకు చేరుకోగానే ఫైర్ వర్క్స్ ఆరంభం అయ్యాయి. విభిన్న రంగులతో వైవిధ్యభరితంగా కనువిందు చేశాయి. వాటిని చూస్తూ కేరింతలు కొట్టారు జనం.

అక్లాండ్‌తో పాటు న్యూజిలాండ్‌ ప్రధాన నగరాలు క్రైస్ట్‌చర్చ్, వెల్లింగ్టన్, క్వీన్స్‌టౌన్, హామిల్టన్, డ్యునెడిన్‌లల్లో ఇదే సందడి వాతావరణం కనిపించింది. తీర ప్రాంతాలన్నీ కూడా పర్యాటకులతో నిండిపోయాయి. కిటకిటలాడాయి. హోటళ్లన్నీ సందర్శకులతో బుక్ అయ్యాయి. న్యూజిలాండ్ ప్రధానమంత్రి క్రిస్టొఫర్ లక్సన్ కొత్త సంవత్సర శుభాకాంక్షలను తెలియజేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+