లండన్ కోర్టుకు చేరిన నీరవ్ అప్పగింత కేసు
లండన్ : లండన్ వీధుల్లో నీరవ్ మోదీ చక్కర్లు కొడుతున్నారని టెలీగ్రాఫ్ పత్రిక కథనం .. శనివారం ఉదయం నుంచి వేగంగా పరిణామాలు మారిపోతున్నాయి. నీరవ్ మోదీ లండన్ లో ఉంటే పట్టుకోవడంలో ఆలస్యమేంటీ అని విపక్ష కాంగ్రెస్ ఆరోపించడంతో అన్ని చర్యలు తీసుకున్నామని విదేశాంగశాఖ ప్రకటించింది. ఆ తర్వాత నీరవ్ అప్పగింత కేసు లండన్ కోర్టుకు చేరింది.

వేగంగా మారుతున్న పరిణామాలు
శనివారం ఉదయం నుంచి నీరవ్ మోదీ ఇష్యూలో వేగంగా పరిణామాలు మారుతున్నాయి. విపక్ష కాంగ్రెస్ పార్టీ ప్రధాని మోదీని లక్ష్యంగా చేసుకొని విమర్శలు చేస్తే .. విదేశాంగ అధికార ప్రతినిధిని రంగంలోకి దింపింది కేంద్రం. అన్నీ చర్యలు తీసుకున్నామని ఆయనతో చెప్పింది. ఈ వరుస పరిణామాలు గమనించిన లండన్ హోంశాఖ సెక్రటరీ .. నీరవ్ అప్పగింత కేసును లండన్ కోర్టుకు చేరింది.

ఆమోదమే తరువాయి ..
విశ్వసనీయ సమాచారం ప్రకారం నీరవ్ మోదీని అప్పగింత కేసుకు సంబంధించి రెండురోజుల క్రితం యుకే హెంమంత్రిత్వ శాఖ లండన్ లోని వెస్ట్ మినిస్టర్ కోర్టుకు ప్రమాణపత్రం దాఖలు చేసినట్టు తెలుస్తోంది. ఈ కేసు విచారణ జరిపి వారెంట్ జారీచేసే అవకాశాలు కనిపిస్తోన్నాయి. గత ఏడాది సెప్టెంబర్ నుంచి నీరవ్ మోదీని అప్పగించాలని ఈడీ లండన్ ప్రభుత్వాన్ని కోరుతున్న సంగతి తెలిసిందే.

ఏయే కేసులంటే ..
బ్యాంకుల వద్ద రుణం తీసుకొని విదేశాలకు పారిపోయిన నీరవ్ మోదీ ఈడీ గతేడాది ఫిబ్రవరిలో మనీ ల్యాండరింగ్ కేసు నమోదు చేసింది. ఈ కేసు సీబీఐ ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ పెట్టింది. పంజాబ్ నేషల్ బ్యాంకు కన్షార్షియం నుంచి 13 వేల కోట్లు రుణం తీసుకొని .. పారిపోవడంతో బ్యాంకులు సీబీఐకి ఫిర్యాదు చేసింది. దీంతో నీరవ్ మోదీపై సీబీఐ 120 బీ .. నేరపూరిత కుట్ర, రెడ్ విత్ 420 .. కుట్ర, 13 (2), 13 (1) (డీ) సెక్షన్ల కింద కేసు నమోదు చేసింది.

ప్రధాని మోదీపై ఆరోపణలు
బ్యాంకుల నుంచి రుణం తీసుకోని నీరవ్ మోదీ పారిపోవడంలో ప్రధాని మోదీ పాత్ర ఉందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ప్రధాని సహకారంతో విదేశాల్లో విలాసవంతంగా కునుకుతీస్తున్నారని మండిపడ్డాయి.
-
భారత్‌పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
భారతీయులకు భారీ శుభవార్త.. హెచ్-1బీ ఆంక్షలు ఎత్తివేత..?? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
తెలంగాణా రైతులకు కేంద్రం తీపికబురు! -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే












Click it and Unblock the Notifications