'ఉత్తర కొరియాలో అత్యంత ప్రమాదకర పరిస్థితులు'
ఓస్లో: ఉత్తర కొరియాలో అత్యంత ప్రమాదకర పరిస్థితులు ఉన్నాయని ఇంటర్నేషనల్ కంపెయిన్ టు అబోలిష్ న్యూక్లియర్ వెపన్స్ (ఐసీఏఎన్) ఆందోళన వ్యక్తం చేసింది.
ఐసీఏఎన్ అణ్వస్త్రాలను సమూలంగా నిర్మూలించేందుకు ఉద్యమిస్తోంది. దీనికి శాంతి విభాగంలో నోబెల్ పురస్కారం వచ్చింది.

ఆదివారం నార్వేలోని ఓస్లోలో జరిగిన కార్యక్రమంలో ఐసీఏఎన్ డైరెక్టర్ బీట్రీస్ ఫిన్ మాట్లాడారు. ప్రస్తుత పరిస్థితులను చూస్తుంటే ఉత్తర కొరియాలో చాలామంది ప్రజలు భయం గుప్పిట్లో బతుకుతున్నారన్నారు. ఐసీఏఎన్ జెనీవా కేంద్రంగా పని చేస్తోంది.
గత కొన్ని నెలలుగా అణ్వస్త్రాల ప్రయోగాలు చేపడుతూ ప్రపంచ దేశాలకు ఉత్తర కొరియా తలనొప్పిగా మారిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications