సాహిత్యంలో నోబెల్ పురస్కారాలు: ఇద్దరి పేర్లను ప్రకటించిన స్వీడిష్ అకాడెమీ
2018కి 2019కి సాహిత్యంలో నోబెల్ పురస్కారాలను ప్రకటించింది రాయల్ స్వీడిష్ అకాడెమీ ఆఫ్ సైన్సెస్. ఈ ఏడాదికి అంటే 2019కిగాను సాహిత్యంలో ఆస్ట్రియాకు చెందిన రచయిత పీటర్ హాండ్‌కేను వరించగా... 2018కి గాను పోలాండ్‌కు చెందిన రచయిత ఓల్గా టోకార్‌జక్‌ను వరించింది. ఇదిలా ఉంటే గతేడాది సాహిత్యంలో నోబెల్ పురస్కరాలను ప్రకటించలేదు. స్వీడిష్ అకాడెమీలో లైంగిక వేధింపుల ఆరోపణలు రావడంతో గతేడాది సాహిత్య రంగంలో నోబెల్ పురస్కారాలను ప్రకటించలేదు.

2019 సాహిత్యరంగంలో నోబెల్ పురస్కారం విజేత పీటర్ హాండ్‌కే
రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఈ ఏడాది సాహిత్యరంగంలో విజేతగా నిలిచిన పీటర్ హ్యాండ్‌కే అత్యంత ప్రభావంతమైన రచయితగా గుర్తింపు పొందినట్లు స్వీడిష్ అకాడెమీ ప్రకటించింది.భాషలతో మానవుడి అనుభవంను మేళవించి అందులో విశిష్టతను వెలికి తీయడంలో ప్రతిభ చాటినందుకుగాను పీటర్ హాండ్‌కేను ఈ అవార్డు వరించిందని స్వీడిష్ అకాడెమీ ప్రకటించింది. దక్షిణ ఆస్ట్రియాలోని ఓ చిన్న గ్రామంలో 1942లో పీటర్‌హాండ్‌కే జన్మించారు. పీటర్ హాండ్‌కే స్లొవేనియన్ మైనార్టీలకు చెందిన వారు.

2018 విజేత ఓల్గా టోకర్ జక్
ఇదిలా ఉంటే 2018కి గాను సాహిత్య రంగంలో నోబెల్ బహుతి ఓల్గా టోకర్‌జక్‌ను వరించింది. సరిహద్దులు దాటడం జీవితంలో ఓ భాగం అని చెబుతూ ఓ చక్కటి కల్పిత కథనం రాసినందుకు ఓల్గాకు నోబెల్ పురస్కారాన్ని ప్రకటించింది. నోబెల్ పురస్కారాలు అందుకున్న మహిళల్లో ఓల్గా 15వ మహిళ కావడం విశేషం. ఓల్గా 1962లో పోలాండ్‌లో జన్మించారు.1993లో ఆమె నవలలు రాయడం ప్రారంభించారు. ఇప్పటివరకు 11 నోబెల్ పురస్కారాల విజేతలను అకాడెమీ ప్రకటించింది.ఇందులో విజేతలంతా పురుషులే కావడం విశేషం.
స్వీడిష్ అకాడెమీలో లైంగిక వేధింపులు
2018లో నోబెల్ ఫౌండేషన్ సాహిత్య రంగంలో పురస్కారాన్ని ప్రకటించలేదు. సాహిత్యరంగంలో పురస్కారాలను నిలిపివేయాల్సిందిగా స్వీడిష్ అకాడెమీని ఆదేశించింది.స్వీడిష్ అకాడెమీలో లైంగిక వేధింపుల ఆరోపణలు రావడంతో నోబెల్ ఫౌండేషన్ రంగంలోకి దిగి ఈ నిర్ణయం తీసుకోవడంతో గతేడాది సాహిత్యరంగంలో నోబెల్ విజేతను ప్రకటించలేదు. అంతేకాదు, ఆర్థిక పరమైన అంశాల్లో అవకతవకలు, అవినీతి జరిగినట్లు కూడా ఆరోపణలు రావడంతో ఈ అవార్డును గతేడాది నిలిపివేశారు.

ఏడు సార్లు నోబెల్ ప్రైజ్‌ను నిలిపివేసిన అకాడెమీ
2017లో ఉద్యమంలా సాగిన మీ టూ క్యాంపెయిన్‌లో ఫ్రెంచ్ స్వీడిష్ ఫోటోగ్రాఫర్ జీన్ - క్లాడ్అర్నాల్ట్ తమను లైంగిక వేధింపులకు గురిచేశారంటూ 18 మంది మహిళలు ఫిర్యాదు చేశారు. ఇలా 20 ఏళ్లకుపైగా తమను లైంగిక వేధింపులకు గురిచేశాడని మహిళలు ఫిర్యాదు చేశారు. జీన్ క్లాడ్ స్వీడిష్ అకాడెమీ సభ్యురాలైన ప్రముఖ కవియిత్రి క్యాతరీనా ఫ్రోస్టెన్‌సన్‌ను వివాహం చేసుకున్నారు. ఇదిలా ఉంటే 1786లో ఏర్పాటు అయిన స్వీడిష్ అకాడెమీ...పురస్కారాలు ఇవ్వకుండా ఏడు పర్యాయాలు నిలిపివేసింది. 1915,1919,1925, 1926,1927వ సంవత్సరాల్లో నోబెల్ అందుకునేంత స్థాయిలో ఎవరి రచనలు లేకపోవడంతో నిలిపివేసింది.
-
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్ -
రామ్‌చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ -
రామ్ చరణ్ బర్త్‌డే గిఫ్ట్ మామూలుగా లేదుగా! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
100 ఏళ్ల రికార్డును తుడిచేస్తున్న గోల్డ్ క్రాష్.. బిట్‌కాయిన్ జేత్రయాత్ర! -
యుద్ధానికి 10 రోజులు బ్రేక్: ట్రంప్ సంచలన నిర్ణయం!












Click it and Unblock the Notifications