Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Nobel Prize 2024 in Physics: గాడ్ ఫాదర్ ఆఫ్ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్‌ను వరించిన అవార్డ్

ప్రతి సంవత్సరం వేర్వేరు రంగాలకు చెందిన శాస్త్రేవేత్తలు, ఆర్థికవేత్తలు, ఇతర సామాజిక ఉద్యమకారులకు అందించే అత్యంత ప్రతిష్ఠాత్మకమైన నోబెల్ బహుమతుల సందడి కొనసాగుతోంది. వారం రోజుల పాటు ఈ అవార్డుల ప్రకటన ఉంటుంది. ఒక్కోరోజు ఒక్కో రంగంలో కృషి చేసిన వారికి నోబెల్ బహుమతులను ప్రకటిస్తారు.

ఆర్థికం, వైద్యం, సామాజిక అంశాలు, పర్యావరణం, ఫిజిక్స్.. ఇలా విభిన్న రంగాల్లో నూతన ఒరవడిని సృష్టించిన, వాటికి ఆద్యులైన శాస్తవేత్తలకు అందించే ఈ అవార్డుల ప్రకటన పరంపర సోమవారమే ప్రారంభమైన విషయం తెలిసిందే. బయాలజీలో అద్భుతాలను ఆవిష్కరించిన అమెరికాకు చెందిన బయాలజిస్ట్ విక్టర్ ఆర్ ఆంబ్రోస్, మాలిక్యులర్ బయాలజిస్ట్ గ్యారీ బ్రూస్ రువ్‌కున్‌కు మెడిసిన్‌లో నోబెల్ బహుమతి వరించింది.

Nobel Prize 2024 in Physics awarded to John J Hopfield and Geoffrey E Hinton

తాజాగా ఫిజిక్స్‌ కేటగిరీలో ఇద్దరు శాస్త్రవేత్తలకు నోబెల్ ప్రైజ్ వరించింది. అమెరికాకు చెందిన జాన్ జోసెఫ్ హాప్‌ఫీల్డ్, బ్రిటిష్-కెనడియన్ కంప్యూటర్ సైంటిస్ట్ కాగ్నిటివ్ సైకాలజిస్ట్ జెఫ్రీ హింటన్‌కు ఈ ఏడాది ఫిజక్స్‌లో నోబెల్ అవార్డు లభించింది.

1982లోనే జాన్ హాఫ్‌ఫీల్డ్ న్యూరల్ నెట్‌వర్క్‌ను కనుగొన్నారు. ప్రస్తుతం ఇది హాఫ్‌ఫీల్డ్ నెట్‌వర్క్‌గా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది. ఆర్టిఫీషియల్ నెట్‌వర్క్‌ను సృష్టించడంలో ఆయన చేసిన సేవలకు గుర్తింపుగా నోబెల్ జ్యూరీ కమిటీ ఆయన పేరును ప్రకటించింది.

జెఫ్రీ హింటన్‌‌.. యూనివర్శిటీ ఆఫ్ టోరంటోలో ప్రొఫెసర్‌గా పని చేస్తోన్నారు. డిపార్ట్‌మెంట్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ విభాగాధిపతిగా వ్యవహరిస్తోన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గాడ్‌ఫాదర్‌గా పిలుస్తారు ఆయనను. న్యూరల్ నెట్‌వర్క్‌లో జాన్ హాఫ్‌ఫీల్డ్‌తో కలిసి సాగించిన ప్రయోగాలు ఈ రంగంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టాయి. దీనికి గుర్తింపుగా నోబెల్ అవార్డ్ లభించింది.

ఈ మేరకు నోబెల్ కమిటీ కార్యదర్శి వారి పేర్లను ప్రకటించారు. స్వీడన్‌లోని స్టాక్‌హోమ్‌లో గల కరోలిన్‌స్కా ఇన్‌స్టిట్యూట్‌లో ఏర్పాటు చేసిన సమావేశం సందర్భంగా ఈ ప్రకటన చేశారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+