సాహిత్యంలో సౌత్ కొరియన్ రచయిత్రి హాన్ కాంగ్‌కు నోబెల్ బహుమతి

సాహిత్యంలో విశేష కృషి చేసినందుకు గానూ 2024 ఏడాదిగానూ సౌత్​ కొరియాక చెందిన రచయిత్రి హాన్​ కాంగ్‌​ (Han Kang) కు సాహిత్య విభాగంలో నోబెల్ బహుమతి దక్కింది. మానవ జీవితపు దుర్బలత్వాన్ని, చారిత్రక విషాదాలను కళ్లకు కట్టినట్లు రాసిన గద్యానికి ఈ పురస్కారం లభించిన్నట్లు స్వీడిష్‌ అకాడమీ వెల్లడించింది. హాన్‌ కాంగ్‌ 'ది వెజిటేరియన్‌' రచనకు గాను 2016లో అంతర్జాతీయ బుకర్‌ ప్రైజ్‌ అందుకోవడం గమనార్హం.

మాంసాహారం మానేయాలని ఓ మహిళ తీసుకున్న నిర్ణయం ఎలాంటి వినాశకర పరిణామాలకు దారితీసిందనే నేపథ్యంగా వెజిటేరియన్‌ నవల ఉంటుంది. 2018లో 'హ్యుమన్‌ యాక్ట్‌' నవల అంతర్జాతీయ బుకర్‌ ప్రైజ్‌ ఫైనల్‌కు చేరింది. కాగా, 2023 ఏడాదికి గానూ నార్వేకు చెందిన రచయిత జాన్ ఫోసెకు సాహిత్య విభాగంలో నెబల్ బహుమతి లభించింది.

Nobel Prize in Literature goes to South Korean author Han Kang

ఆయన తన వినూత్న నాటకాలు, గద్యాలు మాటల్లో చెప్పలేని ఎన్నో అంశాలకు గళంగా మారాయని ఈ అవార్డును ప్రకటించారు. కాగా, సాహిత్య విభాగంలో ఇప్పటి వరకు 119 నోబెల్ పురస్కారాలు లభించాయి. వారిలో 17 మంది మహిళలు ఉన్నారు. చివరిగా 2022లో ఫ్రాన్స్‌​కు చెందిన అన్నీ ఎర్నాక్స్​ నోబెల్ పురస్కారం వరించింది.

వైద్య విభాగంలో మొదలైన నోబెల్ పురస్కార ప్రదానం అక్టోబర్ 14 వరకు కొనసాగనుంది. వైద్య, భౌతిక, రసాయనశాస్త్రాల్లో నోబెల్ గ్రహీతల పేర్లను ఇప్పటికే ప్రకటించారు. తాజాగా, గురువారం సాహిత్యంలో నోబెల్ బహుమతి విజేతను ప్రకటించగా.. శుక్రవారం నోబెల్ శాంతి బహుమతి, అక్టోబర్ 14న అర్థశాస్త్రంలో నోబెల్ గ్రహీతల పేర్లను వెల్లడిస్తారు.

నోబెల్ బహుమతి గురించిన వివరాల్లోకి వెళితే.. స్వీడన్‌కు చెందిన శాస్త్రవేత్త, ఇంజినీర్‌, వ్యాపారవేత్త ఆల్‌ఫ్రెడ్‌ నోబెల్‌ పేరు మీదుగా ప్రపంచంలో వివిధ రంగాల్లో విశేష సేవలందించిన వారికి ఈ అవార్డును ప్రదానం చేస్తున్న విషయం తెలిసిందే. 1896లో ఆల్‌ఫ్రెడ్‌ నోబెల్‌ మరణించగా, 1901 నుంచి ఆయన ట్రస్ట్ ద్వారా ఈ అవార్డులను ఏటా ప్రదానం చేస్తున్నారు. నోబెల్ అవార్డు గ్రహీతలకు 11 లక్షల స్వీడిష్‌ క్రోనర్‌ (10 లక్షల డాలర్లు) నగదు అందిస్తారు. ప్రతి ఏడాది డిసెంబర్‌ 10న నిర్వహించే కార్యక్రమంలో గ్రహీతలకు అవార్డులను అందజేస్తారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+