International News: కిమ్ దూకుడు వార్తలపై ఉత్తర కొరియా క్లారిటీ.. రష్యాకు దళాలను పంపడంపై ప్యాంగ్యాంగ్ ప్రకటన

North Korea news: అభివృద్ది పథంలో భారత్ సూపర్ ఫాస్ట్‌గా దూసుకుపోతుండగా.. ప్రపంచ దేశాలు మాత్రం యుద్ధాలపై ఫోకస్ చేశాయి. రష్యా-ఉక్రెయిన్ మధ్య చెలరేగిన ఈ కార్చిచ్చు క్రమేపీ ఇతర దేశాలకు విస్తరించింది. ప్రపంచం మొత్తం దాదాపు రెండుగా చీలిపోయింది. అమెరికా, దాని మిత్ర దేశాలు ఉక్రెయిన్‌కు మద్ధతిస్తుండగా.. చైనా మరియు నార్త్ కొరియా రష్యాకు సపోర్టుగా నిలబడ్డాయి. ఇండియా మాత్రం ప్రజా ప్రయోజనాలే పరమావధిగా అధికారికంగా తటస్థ వైఖరిని అవలంభిస్తోంది.

ఉక్రెయిన్‌తో పోలిస్తే ఏ విధంగా చూసినా రష్యా అన్నింటిలోనూ గొప్పదే. అగ్రరాజ్యం అమెరికాకు ధీటుగా నిలబడగలిగే సత్తా కలిగిన ఏకైక దేశంగా రష్యాను చెబుతారు. అంతటి గొప్ప దేశాన్ని గత కొన్నేళ్లుగా ఉక్రెయిన్ ముప్పు తిప్పలు పెడుతోంది. భారీ సంఖ్యలో రష్యా సైనికులను మట్టికరిపిస్తూ, నాటో దేశాల సహకారంతో మాస్కో ఆయుధాలను సర్వనాశనం చేస్తోంది. చిన్న దేశం కదా రోజుల వ్యవధిలోనే ఓటమి పాలు చేయవచ్చని భావించిన పుతిన్ కు దిమ్మతిరిగే రేంజ్‌లో షాక్ ఇస్తోంది. దీంతో రష్యా అధినేత పునరాలోచనలో పడి, ప్లాన్‌ B అమలు చేస్తున్నట్లు మీడియా నివేదికలు చెబుతున్నాయి.

North Korea didn t sent tropps to Russia to fight against Ukrain in war

పెద్ద మొత్తంలో సైనిక పాటవాన్ని కోల్పోతుండటంతో ఉత్తర కొరియా సహకారం తీసుకోవాలని రష్యా భావించిందని దక్షిణ కొరియా ఆరోపిస్తోంది. ఉక్రెయిన్‌తో పోరాడేందుకు మాస్కోకు మద్ధతుగా భారీ సంఖ్యలో ప్యాంగాంగ్ సైన్యాన్ని రష్యాకు పంపినట్లు వ్యాఖ్యలు చేసింది. ఇప్పటికే 1,500 మందితో కూడిన ప్రత్యేక దళం అక్కడ ముందు వరుసలో యుద్ధం చేసేందుకు శిక్షణ పొందుతున్నట్లు దక్షిణ కొరియా గూడఛారి సంస్థ పేర్కొంది. ఈ వ్యవహారాన్ని పరిశీలించేందుకు తమ ప్రతినిధిని ఉక్రెయిన్‌కు పంపాలని యోచనలో ఉన్నట్లు తెలిపింది.

ఓ వైపు కొరియన్ ద్వీపకల్పంలో నెలకొన్న ప్రతిష్ఠంభన కొనసాగుతున్న వేళ.. సియోల్ వ్యాఖ్యలను ప్యాంగాంగ్ తీవ్రంగా పరిగణించింది. మాస్కోకు మద్ధతుగా ఉక్రెయిన్‌తో పోరాడటానికి లేదా సహాయం చేయడానికి దళాలను పంపలేదని UN జనరల్ అసెంబ్రీ సందర్భంగా జరిగిన కమిటీ సమావేశంలో ఉత్తర కొరియా స్పష్టం చేసింది. దక్షిణ కొరియా వాదనలు అర్థరహితమని పేర్కొంది. తమ మధ్య చట్టబద్ధమైన, స్నేహపూర్వక మరియు సహకార సంబంధం మాత్రమే ఉందని వివరించింది. రష్యా మరియు ఉత్తర కొరియాల మధ్య సహకారం దక్షిణ కొరియా భద్రత ప్రయోజనాలకు ఏ మాత్రం విరుద్దం కాదని సియోల్‌లోని మాస్కో రాయబారి వెల్లడించారు. నాటో లేదా US కూడా ఈ మోహరింపును ధ్రువీకరించకపోవడం గమనార్హం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+