అమెరికా మరిన్ని గిఫ్ట్ ప్యాకేజీలు: ఉ.కొరియా, యుద్ధం చేయాలని లేదు కానీ: నిక్కీ
వరుస అణు పరీక్షలు, రెండు రోజుల క్రితం హైడ్రోజన్ బాంబు ప్రయోగంతో ప్రపంచానికి ముచ్చెమటలు పోయిస్తున్న ఉత్తర కొరియా.. మరోసారి అమెరికాను హెచ్చరించింది.
ప్యోంగ్‌యాంగ్: వరుస అణు పరీక్షలు, రెండు రోజుల క్రితం హైడ్రోజన్ బాంబు ప్రయోగంతో ప్రపంచానికి ముచ్చెమటలు పోయిస్తున్న ఉత్తర కొరియా.. మరోసారి అమెరికాను హెచ్చరించింది.
చదవండి: ఉ.కొరియా ఎఫెక్ట్: ట్రంప్ అలా చేస్తే చైనాకు నష్టం, హైడ్రోజన్ బాంబుపై భారత్ ఆందోళన

గిఫ్ట్ ప్యాకేజీలు
అమెరికా నుంచి గట్టిగా హెచ్చరికలు వస్తున్నప్పటికీ ఏ మాత్రం తగ్గటం లేదు. తాజాగా మరో హెచ్చరిక జారీ చేసింది. ఓ 'గిఫ్ట్ ప్యాకేజ్'తో తాము అమెరికాకు హెచ్చరికలు చేశామని, ఇటువంటివి మరిన్ని ఉంటాయని వ్యాఖ్యానించింది.

హైడ్రోజన్ బాంబు గిఫ్ట్ ప్యాకేజీ
స్విట్జర్లాండ్ లోని జనీవాలో జరిగిన ఓ సమావేశంలో ఉత్తర కొరియా దౌత్యాధికారి ఒకరు మాట్లాడారు. తమ దేశ రక్షణ కోసం పరీక్షించిన హైడ్రోజన్ బాంబు 'ఓ గిప్ట్ ప్యాకేజ్' అని అభివర్ణించారు.

అమెరికా అలా చేస్తే మేం ఇలాగే
తమ దేశంపై ఒత్తిడి తెచ్చేందుకు అమెరికా నిర్లక్ష్యపూరితంగా చేస్తోన్న రెచ్చగొట్టే వ్యాఖ్యలను మానుకోనంత వరకు తాము ఇటువంటి పరీక్షలు చేస్తూనే ఉంటామని తేల్చి చెప్పారు. అమెరికా చేస్తోన్న వ్యాఖ్యలు తమపై ఏమాత్రం ప్రభావం చూపించవన్నారు.

యుద్ధం చేయాలని అడుక్కుంటున్నారు
కాగా, ఉత్తర కొరియాపై ఐక్య రాజ్య సమితి అమెరికా రాయబారి నిక్కీ హేలీ తీవ్రంగా స్పందించారు. యుద్ధం చేయాలని ఉత్తర కొరియా అధ్యక్షులు కిమ్ జాంగ్ ఉన్ తమ దేశాన్ని (అమెరికా) అడుక్కుంటున్నారని ఎద్దేవా చేశారు. ఉత్తర కొరియా చర్యలపై ఐరాస సెక్యూరిటీ కౌన్సిల్‌లో అమెరికా తీర్మానం పెట్టనున్నట్లు తెలిపారు.

యుద్ధం చేయాలని లేదు కానీ
యుద్ధం జరగాలని అమెరికా ఎప్పుడూ కోరుకోదని, ఇప్పుడు కూడా తమకు యుద్ధం చేయాలనేమీ లేదని, కానీ మా దేశానికి అంత సహనం లేదని, మా ప్రజలను, మా భూభాగాలను మేం రక్షించుకుంటామని హేలీ అన్నారు. ఉత్తర కొరియాతో వాణిజ్య సంబంధాలు కొనసాగించడం అంటే ఆ దేశం నిర్ణయాలు, నిర్లక్ష్యానికి సాయం చేసినట్లేనని, అలాంటి దేశాలపై అమెరికా దృష్టి పెడుతోందన్నారు.
-
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
పదో తరగతి పరీక్షల్లో పొరపాట్లు, ఆ రెండు సబ్జెక్టుల్లో మార్కుల యాడింగ్..ఇలా..!! -
కేంద్రం బ్రహ్మాస్త్రం: రూ. 2.5 లక్షల కోట్ల భారీ పథకం -
అల్లు అర్జున్-అట్లీ మూవీ టైటిల్ లీక్?.. నెట్టింట రచ్చ! -
చుక్కలు చూపుతున్న పసిడి రేట్లు -
ఎవరైనా ఇలా చేస్తే అమరావతి చట్టబద్ధత రద్దవుతుంది: బాంబు పేల్చిన సాయిరెడ్డి -
ఇరాన్ కు సపోర్ట్ చేస్తావా..? పాకిస్థాన్ ను కోలుకోలేని దెబ్బ కొట్టిన యూఏఈ.. -
తిరుమల, అలిపిరిల్లో చిరుతలను గుర్తించడానికి టీటీడీ కొత్త టెక్నాలజీ -
No Stock: ధర చూస్తే గుండె గుభేల్! డ్రైవర్ల కన్నీటి గాథ! -
గ్యాస్ కష్టాలకు చెక్, ఇలా చేస్తే వెంటనే మీ ముందుకే సిలిండర్..!! -
అయ్యో.. విజయ్ ఎలక్షన్ ర్యాలీలో అపశ్రుతి.. -
అమరావతితో కూడిన ఏపీ కొత్త మ్యాప్ వచ్చేసింది.. తేడాలు సుస్పష్టం !!












Click it and Unblock the Notifications