అమెరికాపై దాడులే మా సమాధానం: ఐరాసకు ఉ.కొరియా సంచలన సమాధానం..

ఈ మేరకు ఉత్తరకొరియాలోని ఐరాస(ఐక్యరాజ్య సమితి) ఆ దేశ డిప్యూటీ అంబాసిడర్ కిమ్ ఐరాస సెక్రటరీ జనరల్ ఆంటానియోకు మంగళవారం ఫోన్ ద్వారా విషయం చెప్పారు.

ప్యోంగ్‌యాంగ్: అమెరికాపై దాడుల ఆలోచనను తాత్కాళికంగా విరమించుకున్నట్లు ప్రకటించిన ఉత్తరకొరియా.. తిరిగి మాట మార్చింది. అమెరికా అసంబద్దమైన అణ్వస్త్ర కార్యకలాపాలు, దాని నుంచి ముప్పు పొంచి ఉన్నన్ని రోజులు రాజీకి వచ్చే ప్రసక్తే లేదని తేల్చి చెప్పింది.

ఈ మేరకు ఉత్తరకొరియాలోని ఐరాస(ఐక్యరాజ్య సమితి) ఆ దేశ డిప్యూటీ అంబాసిడర్ కిమ్ ఐరాస సెక్రటరీ జనరల్ ఆంటానియోకు మంగళవారం ఫోన్ ద్వారా విషయం చెప్పారు. ఉత్తరకొరియా ఐరాస అంబాసిడర్ జా సాంగ్ నామ్ కూడా ప్రస్తుతం ఆ దేశంలోనే ఉన్నారు.

తగ్గేది లేదు:

తగ్గేది లేదు:

అమెరికా తన అణ్వస్త్ర పాలసీని కొనసాగించినన్నాళ్లు.. తాము ఆత్మరక్షణలోకి వెళ్లబోమని స్పష్టం కిమ్ ఐరాసకు స్పష్టం చేశారు. దీనిపై స్పందించిన ఆంటానియో.. ఉత్తరకొరియాపై దౌత్య పరంగా ఇది చాతుర్యాన్ని ప్రదర్శించాల్సిన సందర్భం అన్నారు. ఈ విషయం గురించి మాట్లాడటానికి జపాన్, రష్యా, చైనా, అమెరికా, ఉత్తరకొరియా, దక్షిణకొరియాలకు తాను రాయబారిగా అందుబాటులో ఉంటానని తెలిపారు.

పోస్టర్ల కలకలం:

పోస్టర్ల కలకలం:

గతంలో అమెరికాపై దాడులు చేసినట్టు వీడియో తయారు చేసిన ఉత్తరకొరియా తాజాగా పోస్టర్లు కలకలం రేపుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఉత్తరకొరియాను ఇరకాటంలో పెట్టడానికి ఆ దేశంపై ఐరాస విధించిన ఆంక్షలకు ఇలా బదులు తీర్చుకున్నట్లు తెలుస్తోంది.

దాడులను చూపిస్తూ:

దాడులను చూపిస్తూ:

ఉత్తరకొరియా క్షిపణులు అమెరికాలోని లక్ష్యాలను చేరుకోగలవని సూచిస్తూ, కొన్ని నగరాలను ధ్వంసం చేస్తున్న పోస్టర్లను రూపొందించి విడుదల చేశారు. ఈ పోస్టర్లపై అమెరికాలోని కొన్ని పట్టణాల పేర్లు, గువామ్ ద్వీపం పేరు పేర్కొనడం గమనార్హం. తమ దేశంపై ఐరాస ఆంక్షలకు ఇదే మా సమాధానం అంటూ అందులో పేర్కొన్నారు.

ఐరాసపై ఆగ్రహంతో..:

ఐరాసపై ఆగ్రహంతో..:

అణ్వస్త్ర ప్రయోగాలు, యుద్దం విషయంలో ఉత్తరకొరియాలో మార్పు రాకపోవడంతో ఉత్తరకొరియా మిత్ర దేశమైన చైనాను కూడా ఐరాస హెచ్చరించింది. దీంతో ఆ దేశం నుంచి ఉత్తరకొరియాకు జరుగుతున్న ఎగుమతులు, దిగుమతులు తగ్గిపోయాయి. దీంతో ఐరాసపై గుర్రుగా ఉన్న ఉత్తరకొరియా అమెరికాపై దాడులే ఇందుకు సమాధానం అంటూ బదులిచ్చింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+