గడ్డైనా తింటాడు, అణుపరీక్షలు ఆపడు:కిమ్‌పై పుతిన్ ఫైర్

Posted By:
Subscribe to Oneindia Telugu

మాస్కో: ఉత్తరకొరియా క్షిపణి పరీక్షలు నిర్వహించడాన్ని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తీవ్రంగా ఖండించారు. గడ్డి తినేందుకైన ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ సిద్దపడతాడు. కానీ , అణుపరీక్షలను మాత్రం వదలడన్నారు పుతిన్.

టెన్షన్: నవంబర్‌లో ద.కొరియాకు ట్రంప్ , కిమ్‌కు 50 కి.మీ. దూరమే

కొరియా తాజాగా చేసిన అణుపరీక్షలను పుతిన్ తీవ్రంగా ఖండించారు. ఇది ప్రపంచ శాంతికి తీవ్ర విఘాతమని ఆయన వ్యాఖ్యానించారు.

North Korea would 'RATHER EAT GRASS' than give up nukes, Putin warns

అయితే ఇప్పటికిప్పుడు ఉత్తర కొరియా అధినేత కిమ్‌జాంగ్ ఉన్.. అణ్వస్త్ర పరీక్షలను అస్సలు ఆపరని తేల్చిచెప్పారు.

ఐక్యరాజ్యసమితి ఎన్ని కఠిన ఆంక్షలు విధించినా కిమ్‌జాంగ్ తన తీరును మార్చుకోరని పుతిన్ అభిప్రాయపడ్డారు. ఆఖరికి గడ్డి తినడానికైనా సిద్ధపడతారు కానీ.. అణ్వస్త్ర పరీక్షలను కిమ్ ఆపబోరని పుతిన్ స్పష్టం చేశారు.

ట్విస్ట్: కిమ్ వెనుక ఆ రెండు దేశాలు, కట్టడి చేయాలి: అమెరికా

అణ్వస్త్ర పరీక్షలు ఆపిన మరుక్షణమే ఏం జరుగుతుందో కిమ్‌జాంగ్‌కు తెలుసునన్నారు. అందుకే అణ్వస్త్ర పరీక్షలకు కిమ్ ఎంత ఖర్చుపెట్టడానికయిని సిద్ధపడుతున్నారన్నారు.

తాను మరో సద్దామ్‌హుస్సేన్‌లా మారతానేమోనని కిమ్‌కు భయం ఉందని, ఆ భయం, అభద్రతను అమెరికా తొలగిస్తేనే అణ్వస్త్ర పరీక్షలు చేయడం ఆపేస్తారని విశ్లేషించారు. ఆంక్షలతో లాభం లేదనీ, చర్చలతో సమస్యను పరిష్కరించుకోవాలిన అమెరికాకు సూచించారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
The Russian leader mocked the UN attempts to stop North Korea's nuclear plans with a wider set of sanctions.Speaking at a public press conference, Mr Putin said "Do you think that following the adoption of some sanctions, North Korea will abandon its course on creating weapons of mass destruction?

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి