Putin, Kim jong un: రష్యా అధ్యక్షుడు పుతిన్‍తో భేటీ కానున్న ఉత్తర కొరియా నియంత కిమ్ జోంగ్ ఉన్..
ప్రపంచం చూపు రష్యా అధ్యక్షుడు పుతిన్, ఉత్తర కొరియా నియంత కిమ్ జోంగ్ ఉన్ పైనే ఉంది. ఇప్పటికే రష్యా చేరుకున్న కిమ్ పుతిన్ తో భేటీ కానున్నారు.
రష్యాకు చేరుకున్న ఉత్తర కొరియా అధినేతకు మిలిటరీ హానర్ గార్డుతో పాటు ఇరు దేశాల జాతీయ గీతాలు ప్లే చేయడంతో వీఐపీ స్వాగతం లభించిందని ప్రభుత్వ వార్తా సంస్థ KCNA నివేదించింది. ఉత్తర కొరియా రష్యాతో సంబంధాలకు రష్యా ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలుస్తోంది. కిమ్ తన ప్రైవేట్ సాయుధ రైలులో రష్యాలోని ఖాసన్ స్టేషన్‌కు చేరుకున్నాడు.
ఇది ఉత్తర కొరియా నుంచి రష్యాకు తూర్పున ఉన్న ప్రధాన రైలు గేట్‌వే, అక్కడ కిమ్ ఉత్తరాన ప్రయాణించే ముందు రష్యా పర్యావరణ మంత్రి అలెగ్జాండర్ కిమ్ ను కలిశారు. కిమ్ పాటు సీనియర్ ఆయుధ పరిశ్రమ, సైనిక అధికారులు ఉన్నారు. కిమ్ రష్యాలోని ఓడరేవు నగరమైన వ్లాడివోస్టాక్‌లో తూర్పు ఆర్థిక వేదికలో బుధవారం పుతిన్‌ను కలుసుకోవచ్చు. ప్రస్తుతం పుతిన్ అక్కడే ఉన్నారు. ప్రస్తుతం రష్యా ఉక్రెయిన్ తో యుద్ధం చేస్తోంది. దీంతో రష్యాపై ఐక్యరాజ్య సమితి ఆంక్షాలు విధించింది. ఇటు ఉత్తర కొరియాపై కూడా ఆంక్షాలు కొనసాగుతున్నాయి. ఈ రెండు దేశాధినేతలు భేటీ కావడం ఇప్పుడు ప్రాధాన్యత సంతరించుకుంది.

ఉక్రెయిన్ తో యుద్ధం కారణంగా రష్యా తన ఆయుధాలను కోల్పోవాల్సి వచ్చింది. దీంతో ఉత్తర కొరియా నుంచి ఆయుధాలు కొనుగోలు చేసే అవకాశం ఉంది. పుతిన్, కిమ్ భేటీలో ఆయుధాలకు కొనుగోలు సంబంధించి ఒప్పందాలు కూడా జరిగే అవకాశం ఉంది. ఉక్రెయిన్‌లో 18 నెలల పోరాటంలో భారీగా క్షీణించిన స్టాక్‌లను భర్తీ చేయడానికి మాస్కోకు ఆయుధాలను అందించాలని ప్యోంగ్యాంగ్ యోచిస్తున్నట్లు అమెరికా ఆందోళన వ్యక్తం చేస్తోంది. మందుగుండు సామాగ్రి కొరత కారణంగా రష్యా తన షెల్లు, రాకెట్లను సంరక్షించవలసి వచ్చింది.
వాటి వినియోగంపై పరిమితులు కూడా విధించింది. ఈ నేపథ్యంలో ఉత్తర కొరియా నుంచి ఆయుధాలు కొనుగోలు చేసే అవకాశం ఉంది. కొరియన్ పీపుల్స్ ఆర్మీ మార్షల్ పాక్ జోంగ్-చోన్, మ్యూనిషన్స్ ఇండస్ట్రీ డిపార్ట్‌మెంట్ డైరెక్టర్ జో చున్-రియోంగ్‌లతో సహా తన సైనిక అధికారులతో కిమ్ రష్యాకు వెళుతున్నట్లు విశ్లేషకులు తెలిపారు. దీన్ని బట్టి ఆయుధాల కొనుగోలుకు ఒప్పంద జరిగే అవకాశం ఉంది. ఉత్తర కొరియా కూడా తన ఆయుధాలను అమ్మడం అవసరంగా మారింది. ఆయుధాలు అమ్మగా వచ్చిన డబ్బుతో ధాన్యం కొనుగోలుతో పాటు అధునాత ఆయుధాల తయారీకి వినియోగించాలని చూస్తోంది.












Click it and Unblock the Notifications