వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అంత పనిచేయొచ్చు: ఉ.కొరియా మామూలుది కాదు!, ఆ అవకాశాలు ఎక్కువే?

భౌగోళికంగాను, ఆర్థికంగాను చాలా చిన్న దేశమే అయినప్పటికీ.. అణ్వస్త్ర శక్తితో ఉత్తరకొరియా ఇప్పుడు అంతర్జాతీయ సమాజ దృష్టిని ఆకర్షించింది. అణ్వస్త్ర ఆయుధాలను కుప్పల కొద్ది పోగేసుకున్న అమెరికా..

|
Google Oneindia TeluguNews

ప్యోంగ్‌యాంగ్: భౌగోళికంగాను, ఆర్థికంగాను చాలా చిన్న దేశమే అయినప్పటికీ.. అణ్వస్త్ర శక్తితో ఉత్తరకొరియా ఇప్పుడు అంతర్జాతీయ సమాజ దృష్టిని ఆకర్షించింది. అణ్వస్త్ర ఆయుధాలను కుప్పల కొద్ది పోగేసుకున్న అమెరికా.. అదే సాకుతో ఉత్తరకొరియాను టార్గెట్ చేయాలనుకోవడం.. ద్వంద్వ నీతే అనడంలో అతిశయోక్తి లేదు.

అసామన్యం: ఉ.కొరియా ఎంతలా ఎదిగిందంటే?, రహస్య డాక్యుమెంట్లలోనే అదే..అసామన్యం: ఉ.కొరియా ఎంతలా ఎదిగిందంటే?, రహస్య డాక్యుమెంట్లలోనే అదే..

అయితే అమెరికాతో పోలిక తెచ్చి ఉత్తరకొరియా అణ్వస్త్ర ప్రయోగాలను సమర్థించినట్టుగా మాట్లాడటం కూడా సబబు కాదేమో!. తినడానికి తిండి, కనీస వసతులు కూడా లేక లక్షల మంది అల్లాడుతున్న దేశంలో కోట్ల రూపాయలను అణ్వస్త్ర ప్రయోగాలకు వెచ్చించడం.. తద్వారా ప్రపంచ శాంతికి కూడా ముప్పు వాటిల్లే పరిణామాలను సృష్టించడం కూడా ఆందోళన రేకెత్తిస్తోన్న అంశం.

భయంకరమైన నిజాలు: భూతల నరకం ఉ.కొరియా, ప్రపంచానికి తెలియని అక్కడి బతుకు?భయంకరమైన నిజాలు: భూతల నరకం ఉ.కొరియా, ప్రపంచానికి తెలియని అక్కడి బతుకు?

కొట్టిపారేయలేం:

కొట్టిపారేయలేం:

ఉత్తరకొరియా అధికార ప్రతినిధి రి యోంగ్ పిల్ ఆ దేశ అణ్వస్త్ర ప్రయోగాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గత నెలలో ఉత్తరకొరియా విదేశాంగ శాఖ మంత్రి చేసిన వ్యాఖ్యలను తేలిగ్గా తీసుకోవద్దన్నారు. హైడ్రోజన్ బాంబు విషయంలో కేవలం మాటలకే పరిమితం కాకుండా.. తమ సత్తా ఏంటో చేతల్లో చూపించడానికే ఉత్తరకొరియా ఉవ్విళ్లూరుతోందన్నారు.

 రి యోంగ్ హో ఏమన్నారు?:

రి యోంగ్ హో ఏమన్నారు?:

ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ సందర్భంగా గత నెల న్యూయార్క్ వచ్చిన ఉత్తరకొరియా విదేశాంగ శాఖ మంత్రి అణ్వస్త్ర ప్రయోగాల గురించి పలు వ్యాఖ్యలు చేశారు. ఉత్తరకొరియా హైడ్రోజన్ బాంబును ప్రయోగించే అవకాశాలను ఆయన ప్రస్తావించారు. పసిఫిక్ మహాసముద్రం మీదుగా ఉత్తరకొరియా హైడ్రోజన్ బాంబు ప్రయోగించవచ్చునని ఆ సందర్భంగా చెప్పారు. ఉత్తరకొరియా అధ్యక్షుడిని దగ్గరిగా ఎరిగిన వ్యక్తిగా, ఆయన పాలనా విషయాల్లో ప్రమేయం ఉన్న వ్యక్తిగా రి యోంగ్ హో చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.

సంక్షోభమే:

సంక్షోభమే:

గత సెప్టెంబర్ లో ఉత్తరకొరియా ఆరు అణు క్షిపణి ప్రయోగాలు చేపట్టింది. ఇందులో హైడ్రోజన్ బాంబు ప్రయోగం కూడా జరిగిందనే ప్రచారం ఉంది. దీంతో రంగంలోకి దిగిన ఐరాస ఆ దేశంపై పలు ఆంక్షలు విధించింది. ఐరాస ఆదేశాలతో ఉత్తరకొరియాతో తమ వాణిజ్య సంబంధాలకు చైనా ఫుల్ స్టాప్ పెట్టింది. ఈ పరిణామం ఉత్తరకొరియా ఆర్థిక మూలాలను దెబ్బతీసేదిగా తయారైంది. ఇదే బాటలో మరికొన్ని దేశాలు కూడా పయనించడంతో ఉత్తరకొరియా తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోందనే చెప్పాలి.

 అమెరికా దేనికైనా సిద్దమే:

అమెరికా దేనికైనా సిద్దమే:

ఉత్తరకొరియా గనుక అణుదాడికి సిద్దపడితే అమెరికా ఎంతకైనా సిద్దమేనని ఇప్పటికే ఆ దేశాధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. 'ఏం జరుగుతుందో చూద్దాం.. మీరు నమ్మశక్యం కానీ రీతిలో మేం సంసిద్దంగా ఉన్నాం'.. అని చెప్పుకొచ్చారు. తమ సామర్థ్యాన్ని అంచనా వేయగలిగితే షాక్ కు గురికాక తప్పదని అన్నారు. వచ్చే నెలలో ట్రంప్ ఆసియా పర్యటన ఉన్నందునా.. దక్షిణ కొరియాలో ఆయన పర్యటించే అవకాశం ఉంది. ఈ సందర్భంగా ఆయన ఉత్తరకొరియా విషయంపై చర్చించవచ్చు.

English summary
A senior North Korean official has issued a stern warning to the world that it should take "literally" his country's threat to test a nuclear weapon above ground.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X