కాపాడేదెవరు?: ‘ఏసు ఫొటో బదులు జిన్పింగ్ ఫొటో పెట్టుకోండి’
బీజింగ్: క్రైస్తవులు ఆరాధించే క్రీస్తు ఫొటోకు బదులుగా చైనా అధ్యక్షుడు జిన్పింగ్ ఫొటో పెట్టుకోవాలని ఆ దేశ అధికారులు సూచించడం చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వం నుంచి లబ్ధి చేకూరాలంటే జిన్పింగ్ ఫొటో పెట్టుకోవాల్సిందేనని అన్నారు.
'పేదరికం, అనారోగ్యం నుంచి క్రీస్తు కాపాడరు.. చైనా కమ్యూనిస్ట్ పార్టీ కాపాడుతోంది' అని అధికారులు చెబుతున్నారు. అందుకే క్రీస్తు ఫొటోకు బదులుగా జిన్పింగ్ ఫొటోలు పెట్టండని అధికారులు తేల్చి చెబుతున్నారు.

కాగా, చైనాలోని యుగాన్ కౌంటీలో వేల సంఖ్యలో క్రైస్తవులు ఉంటారు. ఈ యుగాన్ కౌంటీలో ఉంటున్న ప్రజలు పేదరికంతో కొట్టుమిట్టాడుతున్నారు. వారిని పేదరికం నుంచి బయటకు తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ విధంగా చేస్తున్నట్లు అక్కడి అధికారులుచెబుతుండటం గమనార్హం.
అయితే, యుగాన్ కౌంటీ ప్రజలు ప్రభుత్వ అధికారులు చెప్పినట్లు చేయడానికి సుముఖంగా ఉన్నారని వాషింగ్టన్ పోస్టు నివేదిక పేర్కొంది. ఇప్పటికే క్రైస్తవ మతానికి సంబంధించిన 624 పోస్టర్లను తొలగించి, వాటి స్థానంలో 453 జిన్పింగ్ ఫొటోలను పెట్టుకుంటున్నారట. 2020 నాటికి చైనాలో పేదరికాన్ని నిర్మూలించేందుకు.. ఇలా జిన్పింగ్ ఫొటోలు పెట్టుకోమని అధికారులు ప్రోత్సహిస్తుండటం గమనార్హం.
-
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
పాకిస్తాన్ క్రికెట్ కు ఓ దండం..మెయిన్ విలన్ ఆయనే: కిర్స్టెన్ -
"ధురంధర్" డైరెక్టర్ నెక్స్ట్ సినిమా ఆ స్టార్ హీరోతోనే ??? -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
డైరెక్ట్ గా ఇరాన్ నుంచే భారత్ ఆయిల్ కొనుగోళ్లు: గ్యాస్ కొరతకూ చెక్ -
డొనాల్డ్ ట్రంప్ సడన్ యూటర్న్- యుద్ధ విరామం












Click it and Unblock the Notifications