ఆశ్చర్యం: ఎయిర్ హోస్టెస్ ఆడిషన్స్‌లో బికినీ పరేడ్
బీజింగ్: ఎయిర్ హోస్టెస్, విమానాల్లో సహాయకురాలిగా మహిళలు ఉద్యోగాలు పొందాలంటే ఖచ్చితంగా బికినీ పరేడ్ చేయాల్సిందేనని చైనాలో ఓ మోడలింగ్ సంస్ధ వింత పోకడకు తెరదీసింది. సాధారణంగా ఎయిర్ హోస్టెస్ ఉద్యోగాలకు అందమైన అమ్మాయిలనే ఎంపిక చేస్తుంటారు.
తూర్పు చైనా షాన్‌డాంగ్ ప్రావిన్స్‌లోని క్వింగ్‌డావ్ పట్టణంలో ఎయిర్ హోస్టెస్ ఉద్యోగాల కోసం దాదాపు 1000 మంది మహిళలు దరఖాస్తు చేసుకోగా, వీళ్లందరికీ బికినీ పరేడ్ నిర్వహించి ఆశ్చర్యానికి గురిచేశారు. ఓరియంటెడ్ బ్యూటీ అనే మోడలింగ్ ఏజెన్సీకి ఎయిర్ హోస్టెస్ ఎంపిక బాధ్యతలు అప్పగించారు.

ఆ ఏజెన్సీ ప్రతినిధులు ఎయిర్ హోస్టెస్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న యువతులతో ఈ విధంగా ప్రవర్తించారు. ఎయిర్ హోస్టెస్‌కు బికినీ పరేడ్ ఎందుకు నిర్వహించారని ప్రశ్నించడంతో అత్యవసర పరిస్థితుల్లో అందం కంటే అప్రమత్తతే బాధ్యతగా భావించేందుకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని మోడలింగ్ ఆడిషన్స్ చేపట్టిన నిర్వహకులు అంటున్నారు.
సామాజిక బాధ్యత పెంచుతూనే ఎయిర్ అసిస్టెంట్ వంటి ఉద్యోగాల్లో రాణించేందుకు మహిళలకు ఇలాంటి ఈవెంట్‌లు దోహదం చేస్తాయని నిర్వాహకులు తెలిపారు. అంతేకాదు చాలా మంది బికినీలో చాలా అందంగా ఉన్నారని తెలిపారు. అయితే బికినీ పరేడ్ చేయడం ఇష్టలేని యవతులు వెంటనే వెనుతిరిగారు.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్‌కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!!












Click it and Unblock the Notifications